‘నేను వాడిని చంపేస్తాను’.. సూపర్ స్టార్ నోట తెలుగు మాట.. ‘ఆరాట్టు’ టీజర్ ఇంట్రెస్టింగ్..

Aaraattu Movie Teaser: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆరాట్టు'. గ్రాండ్ మాస్టర్, మిస్టర్ ఫ్రాడ్, విలన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బి.ఉన్నికృష్ణన్

'నేను వాడిని చంపేస్తాను'.. సూపర్ స్టార్ నోట తెలుగు మాట.. 'ఆరాట్టు' టీజర్ ఇంట్రెస్టింగ్..
Mohan Lal
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2021 | 6:25 PM

Aaraattu Movie Teaser: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆరాట్టు’. గ్రాండ్ మాస్టర్, మిస్టర్ ఫ్రాడ్, విలన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బి.ఉన్నికృష్ణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ ఐఎఎస్ అధికారిణిగా నటిస్తుండగా.. విజయ రాఘవన్, సాయి కుమార్, సిద్దిక్, జానీ ఆంటోని, స్వస్తిక, మాలవికా మీనన్, నేహా సక్సేనా, సీత కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విషు పండుగను పురస్కరించుకొని ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన టీజర్‏లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏తోపాటు మోహన్ లాల్ హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‏గా కనిపిస్తున్నారు. పంచే కట్టుకొని ఫైట్ చేస్తున్న సీన్స్ మరింత స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచాయి. ఇక ఈ వీడియో చివర్లో తెలుగులో కంప్లీట్ యాక్టర్ నేను వాడిని చంపేస్తాను అని చెప్పే డైలాగ్‏ ఉంటుంది. దీనిని బట్టి చూస్తే.. ఈ సినిమా స్టోరీకి తెలుగు ప్రాంతానికి లింక్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి విజయ్ ఉలగానాథ్ సినిమాటోగ్రఫీ అందించారు. షమీర్ మహమ్మాద్ ఎడిటింగ్ చేయగా.. రాహుల్ రాజ్ సంగీతాన్ని అందించారు. అలాగే.. అనిల్ అరసు.. కె. రవివర్మ్, ఎ విజయ్, సుప్రీం సుందర్ యూక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఇటీవల దృశ్యం 2 చో సూపర్ హిట్ అందుకున్న మోహన్ లాల్ ఆరాట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి.

టీజర్..

Also Read: సోనూసూద్ చేసిన పనికి చిరు టీం షాక్.. స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన రియల్ హీరో..

Balakrishna: సోషల్ మీడియాలో బాలయ్య బాబు హవా.. నెంబర్ వన్‏గా దూసుకెళ్తున్న ‘అఖండ’.. బోయపాటి ప్లాన్ అదుర్స్..

కొత్త డైరెక్టర్‏తో ఈసారి సీరియస్‏గా వస్తానంటున్న శర్వా.. మరోసారి పోలీస్‏గా యంగ్ హీరో..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..