ఎన్టీఆర్ కోసం మహేష్ హీరోయిన్.. ప్లాన్ చేస్తోన్న చిరు డైరెక్టర్.. మరోసారి తెలుగులోకి ముంబై బ్యూటీ..

Jr.NTR New Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్‏తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన

  • Rajitha Chanti
  • Publish Date - 9:05 pm, Wed, 14 April 21
ఎన్టీఆర్ కోసం మహేష్ హీరోయిన్.. ప్లాన్ చేస్తోన్న చిరు డైరెక్టర్.. మరోసారి తెలుగులోకి ముంబై బ్యూటీ..
Jr.ntr

Jr.NTR New Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్‏తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వీరిద్దరికి జోడీలుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామా ఒలివియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ కొరటాల శివతో అంటూ అఫీషియల్ ప్రకటన ఇచ్చేసి తన అభిమానులకు షాకిచ్చాడు. గతంలో వీరిద్దరి కాంబోలో జనతా గ్యారెజ్ వంటి సూపర్ హిట్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతుండడంతో.. ఈ మూవీపై ఎక్కువగానే అంచనాలను పెట్టెసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్. ప్రకటన వచ్చింది మొదలు.. ఈ సినిమా గురించిన గాసిప్స్ ఫిల్మ్ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మళ్లీ మేసేజ్ ఒరియేంటెడ్‏గానే ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడట డైరెక్టర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భారత్ అనే నేను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఈ మూవీ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించి మెప్పించింది కియారా. తాజాగా ఈ అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‏కు జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కియారా హిందీలో భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలే వంటి చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది.

Also Read: సాయిపల్లవి అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. రానా దగ్గుపాటి ‘విరాట పర్వం’ వాయిదా..

కత్రినా కైఫ్ గురించి మనసులో మాటను బయటపెట్టిన విరాట్… నెట్టింట్లో వైరల్‏గా మారిన కోహ్లీ వీడియో..