సాయిపల్లవి అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. రానా దగ్గుపాటి ‘విరాట పర్వం’ వాయిదా..

Virata Parvam Movie Update: దేశంలో కరోనా మహమ్మరి మరోసారి పంజా విజృభిస్తుంది. గతంతో పోలిస్తే.. ఈసారి సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.

సాయిపల్లవి అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. రానా దగ్గుపాటి 'విరాట పర్వం' వాయిదా..
Virata Parvam
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2021 | 8:43 PM

Virata Parvam Movie Update: దేశంలో కరోనా మహమ్మరి మరోసారి పంజా విజృభిస్తుంది. గతంతో పోలిస్తే.. ఈసారి సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు స్వయం లాక్ డౌన్ విధించుకుంటుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ఈ కొవిడ్ మహమ్మారి సామాన్య ప్రజలనే కాకుండా.. సినీ ఇండస్ట్రీని కూడా మరోసారి పట్టి వేధిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు ఈ మహమ్మారి భారిన పడగా.. పలు రాష్ట్రాల్లో సినిమా, సీరియల్ షూటింగ్స్ నిలిపివేశారు. థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే పలు చిత్రాలు సూపర్ హిట్‏గా అటు నిర్మాతలకు, దర్శకులకు ఆశలు కలిగించాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే టాలీవుడ్‏లో దాదాపు అన్ని సినిమాలు విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.

ఇప్పటికే అక్కినేని సాయి పల్లవి జంటగా.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’, నాని టక్ జగదీష్ సినిమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ క్వీన్ కంగన నటించిన ‘తలైవి’ చిత్రం కూడా వాయిదా పడింది. ఇక రానా నటించిన అరణ్య హిందీ వెర్షన్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఇదే తరహాలో రానా దగ్గుపాటి, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రం కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ బుధవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్వీట్..

Also Read: కత్రినా కైఫ్ గురించి మనసులో మాటను బయటపెట్టిన విరాట్… నెట్టింట్లో వైరల్‏గా మారిన కోహ్లీ వీడియో..

‘నేను వాడిని చంపేస్తాను’.. సూపర్ స్టార్ నోట తెలుగు మాట.. ‘ఆరాట్టు’ టీజర్ ఇంట్రెస్టింగ్..