AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష.. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తాంః కేసీఆర్

Nagarjuna sagar by Election: ముఖ్యమంత్రి పదవి ఎవరో పెట్టిన బిక్ష కాదని.. తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా సభలో మాట్లాడారు.

సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష.. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తాంః కేసీఆర్
Cm Kcr In Sagar By Election
Balaraju Goud
|

Updated on: Apr 14, 2021 | 7:46 PM

Share

CM KCR Halia sabha: ముఖ్యమంత్రి పదవి ఎవరో పెట్టిన బిక్ష కాదని.. తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసింది శూన్యమని కేసీఆర్‌ ఆరోపించారు. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. నియోజకవర్గంలోని హాలియాకు డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని నాగార్జున సాగర్ ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం. నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమన్న సీఎం.. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. భగత్‌కు కురిపించే ఓట్లలాగే నెల్లికల్‌ లిఫ్ట్‌కు నీళ్లు కూడా త్వరలోనే దూకుతాయని చెప్పారు. నల్లగొండ జిల్లాను ప్లోరిన్ రహిత జిల్లాగా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. నెల్లికల్లుతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గంలో త్వరలోనే లిఫ్టులను పూర్తి చేస్తామన్న ఆయన.. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు.

సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు ఈ సభ జరగకూడదని, ప్రజలతో కలవకూడదని ప్రతిక్షాలు చేయని ప్రయత్నం లేదని సీఎం మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకుని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలు చెప్పుకునే హక్కుందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికలో ప్రధానితో సహా అందరూ విశేషంగా ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ జరగనీయొద్దని చాలా చాలా ప్రయత్నాలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టాలని.. ఆపై ఆలోచనతోని, పరిణతితో ఓటు ఇవ్వాలని. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. మన విచక్షణ ఉపయోగించాలని కేసీఆర్ సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు.

ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్యను ప్రజా దర్బార్ పెట్టి పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని నాగార్జున సాగర్ నుంచే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్‌ సమస్యలు టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తీరుతాయన్నారు కేసీఆర్‌. వేరేవాళ్లు గెలిస్తే ఎలాంటి ఫలితం ఉండదని పేర్కొన్నారు. Read Also…  తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో సక్కర్ ఫిష్ కలకలం.. తోటి చేపల్ని, జీవుల్నీ ఇది మింగేస్తుంది