CM KCR Halia Live: హాలియాలో ఉప ఎన్నిక ప్రచారం.. సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్షః కేసీఆర్
ఉప ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా ప్రధాన పార్టీలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు.
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేపటితో తెరపడనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బైఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటా పోటీ ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా ప్రధాన పార్టీలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆది నుంచి ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లర్లను ఆకర్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు ఓటు వేయాలని టీఆర్‌ఎస్ నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా బహిరంగ సభకు బయలు దేరిన సీఎం కెసిఆర్. మార్గమధ్యంలో యాచారం వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. భారీ తరలివచ్చిన జనాన్ని చూసిన సీఎం తన వాహనం నిలిపి ప్రజలకు అభివాదం చేశారు.
LIVE NEWS & UPDATES
-
సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్షః సీఎం కేసీఆర్
- పోడు భూము సమస్యలను ప్రజా దర్బార్ పెట్టి పరిష్కరిస్తాం, ఈ కార్యక్రమాన్ని నాగార్జున సాగర్ నుంచే ప్రారంభిస్తాంః కేసీఆర్.
- నెల్లికల్లుతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన లిఫ్టులను పూర్తి చేయకుంటే ఎన్నికల్లో ఓట్లు అడగంః కేసీఆర్
- తనకు సీఎం పదవి జానారెడ్డి పెట్టిన బిక్ష కాదని తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష అన్నారు కేసీఆర్
- కాంగ్రెస్ పదవుల కోసం కొట్లాడితే టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిందన్నారు కేసీఆర్.
- సభను అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు చేశారని , కాని దేవుడి దయ ఉంటే ఎన్ని అడ్డంకులనైనా అధిగమిస్తామన్నారు కేసీఆర్.
- సాగర్ సమస్యలు టీఆర్‌ఎస్ గెలిస్తేనే తీరుతాయన్నారు కేసీఆర్. వేరేవాళ్లు గెలిస్తే ఎలాంటి ఫలితం ఉండదన్నారు
-
తెలంగాణ ప్రజలు నాకు ముఖ్యమంత్రి పదవి భిక్ష పెట్టారు. జానారెడ్డి కాదు. తెలంగాణ కోసం చాలాసార్లు రాజీనామా చేశాం.
-
-
నోముల భగత్‌కు ఏవిధంగా ఓట్లు పడతాయో అదే విధంగా నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు.
-
కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డివల్ల నాగార్జున సాగర్‌కు ఒరిగిందేమీలేదుః కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో పేదలను పట్టించుకోలేదని తెలిపారు.
-
కేసీఆర్ అడ్డుకునేందుకు కుట్రలు పన్నిన వారి పని పట్టాల్సిన అవసరముందిః కేసీఆర్
-
-
రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాంః కేసీఆర్
గులాబీ జెండా పుట్టుక ముందు తెలంగాణ అనాథగా మిగిలింది. రాష్ట్ర ఎర్పడ్డా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాంః కేసీఆర్
-
కరంట్ కష్టాలు తొలగిపోయాయిః సీఎం
24గంటల పాటు విద్యుత్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదేః కేసీఆర్
-
ప్రజా సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి ఉందిః కేసీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ హయాంలోనే ప్రజా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి
-
తెలంగాణ కోసం పదవులు వదులుకున్నాంః కేసీఆర్
పదవుల కోసం తెలంగాణను వదిలివేసింది కాంగ్రెస్ నేతలు, కానీ తెలంగాణ కోసం పదవులు వదిలిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేః కేసీఆర్
-
త్వరలో సాగర్‌లో డిగ్రీ కాలేజ్
నాగార్జున సాగర్‌లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కేసీఆర్ హామీ
-
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. జిల్లా నేతలు, మండలాల బాధ్యులు, అభ్యర్థి నోముల భగత్ సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. సీఎం సభకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభా నిర్వహణ కొనసాగుతుంది.
Published On - Apr 14,2021 6:56 PM