Telangana Temple: ఆ ఆలయంలో అడుగడునా పాములు… రహస్యమేంటో తెలుసా…?
మహబూబాబాద్ రూరల్ జిల్లా గార్ల మండలంలో కొలువుదీరిన కొండలమ్మ ఆలయం ఎంతో ప్రాచీనమైనది. కాకతీయుల కాలంలో...
మహబూబాబాద్ రూరల్ జిల్లా గార్ల మండలంలో కొలువుదీరిన కొండలమ్మ ఆలయం ఎంతో ప్రాచీనమైనది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ పురాతన ఆలయంలో ఉగాదిని పురస్కరరించుకుని ఏటా నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. అయితే, ఈ సారి కొవిడ్ కారణంగా జాతర నిర్వహించలేదు. కానీ, పండగ సందర్బంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, ఇక్కడి ఆలయంలో భక్తులకు అడుగడునా పాములు కనిపించాయి.
కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది ఇక్కడి కొండలమ్మ ఆలయం. రుద్రమదేవి పాలన కాలంలో కొండలమ్మ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. వరంగల్ వేయి స్తంభాల గుడి, గార్ల కొండలమ్మ ఆలయం ఒకే సమయంలో నిర్మించినట్లుగా ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. గారమ్మ, కొండలమ్మ, భయమ్మ అనే ముగ్గురు అక్కా చెల్లెల్ల పేరుమీదనే జిల్లాలో మూడు చెరువులు నిర్మించినట్లుగా చెబుతున్నారు. గార్ల చెరువు, బయ్యారం చెరువు, కొండలమ్మ చెరువు వారి పేరుపైనే ఏర్పడ్డాయని అంటున్నారు. ఆ అక్కా చెల్లెల్లే పాముల రూపంలో ప్రత్యక్షమవుతుంటారని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇదిలా ఉంటే, ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన కొండలమ్మ దేవాలయాన్ని పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుర్తించి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.
Also Read: తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో సక్కర్ ఫిష్ కలకలం.. తోటి చేపల్ని, జీవుల్నీ ఇది మింగేస్తుంది
‘మందగా ఉంటే ఆ బలమే వేరప్పా’.. సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. స్పాట్ డెత్