- Telugu News Entertainment Television Karthika deepam serial april 15th 2021 written episode karthik convinces deepa to go to the hospital
Karthika Deepam Serial: ఇన్నాళ్లకు దీప కోరిక నెరవేర్చిన కార్తీక్.. సరికొత్త ప్లాన్ కు తెరలేపిన మోనిత.. నెక్స్ట్ ఏంటి..!
Karthika Deepam Serial: దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1014 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీపని మందులు వేసుకోమని అడగడానికి బయటకు తీసుకెళ్లిన కార్తీక్.. మరి ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..!
Updated on: Apr 15, 2021 | 11:41 AM

దీపని ఒక తోటలోకి తీసుకొచ్చిన కార్తీక్.. దీప చేతులు పట్టుకుని నిన్ను ఎలా అడగాలో నాకు తెలియడం లేదు.. ఎలా ఒప్పించాలో తెలియడం లేదు.. ట్రీట్మెంట్ చేయించుకో దీప అంటాడు. నాకున్న జబ్బుకి నేను బతకనని డాక్టర్లు చెప్పారా డాక్టర్ బాబు. అంటుంది.. ఛీఛీ అటువంటి ఏమీ లేదు అంటే.. నాకు సీరియస్ జబ్బా ఏమీ కానప్పుడు ఇంత బతిమాల్సిన అవసరం ఏముంది డాక్టర్ బాబు అంటే.. నువ్వు అంత లాజిక్ లు మాట్లాడకు.. నాకు అసలే మంటగా ఉంది.. అంటాడు. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు డాక్టర్ బాబు అంటుంది దీప.

ఈ నీరసం తలనొప్పి వంటివి గత పదేళ్లుగా ఉన్నవే డాక్టర్ బాబు అంటుంది. మందులు వేసుకుంటే పోయింది.. ఇప్పుడు నా ప్రాణాల కోసం కాసుకు కూర్చుందా ఈ రోగం .. అంటే.. లేదు అంటాడు కార్తీక్.. దీంతో దీప పిల్లలు ఎక్కడకు చేరాలో అక్కడికి చేరారు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఇప్పుడు నా జీవితం మీద నాకు క్లారిటీ వచ్చింది అంటుంది. ఇంక ఇంటికి వెళ్దాం అన్న దీప తో లేదు హాస్పటల్ కు వెళ్దాం.. అంటాడు .. కార్తీక్. ఇవ్వాళ నేను నిన్ను ఎలాగైనా ఒప్పించే తీసుకుని వెళ్తాను అంటే.. మీరు నన్ను ఒప్పించలేరు. నేను మిమ్మల్ని నొప్పించలేను వెళ్ళిపోదాం పదండి అంటుంది దీప


నేను పిచ్చిదానిని రమ్మంటే.. పిల్లలకి ఆయాగా రావాలా.. మీ అమ్మగారికి కోడలుగా రావాలా అని అడగలేదు.. మీరు ఇడ్లి బండి దగ్గర చూపించిన సినిమాను చూసి నమ్మను. పిల్లల్లో మళ్లీ నాన్న కావాలనే ఆశను పెంచారు.. అందుకనే వచ్చాను. అయినా నా గుండెల్లో ఎంత దు:ఖం ఎంత గూడి పట్టుకుపోయిందే తెలుసా? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. హిమని కనుక మీ అమ్మాగారు మీ చేతుల్లో పెట్టకపోయి ఉంటె నేను ఏమై పోయినా మీకు అనవసరం అనుకునేవారు అవునా కాదా అంటుంది దీప..

దీప మాటలకు కాదు అంటూ.. కార్తీక్ అంటుంటే.. అయితే నన్ను సౌందర్య కోడలిగా కాదు.. మీ భార్యగా ఒప్పుకోండి అంటుంది దీప.. అయితే ట్రీట్మెంట్ తీసుకోవా... కనీసం పిల్లల కోసం కూడా పంతం వదులుకోవాలా.. అంటే నా చావు గురించి కూడా ఆలోచించను అన్న దీపని కొడతాడు కార్తీక్. ఇప్పుడు చెప్పవే .. ఎవడు నిన్ను కొట్టేది.. డాక్టర్ కొడతాడా? సౌందర్య గారి కొడుకు కొడతాడా? నీ మొగుడు కొడతాడా? కొట్టే హక్కు ఎవడికి ఉంటుంది. మొగుడికి ఉంటుంది. నాకుంటుంది..ఇప్పుడు చెప్పవే రాక్షసి. నువ్వు ఏమైతే నాకు ఏమిటి అని దులేసుకుని వెళ్లిపోయేవాడిని కదా అంటూ తాళి చూపిస్తూ.. దీనిని కట్టింది నేనే కదా.. నడువు... రాను అంటే ఇంకో నాలుగు పీకు తాను నీపంతం తగలెయ్య.. అంటాడు కార్తీక్..

ఇక మరోవైపు మోనిత సౌందర్య ఇంటికి వస్తుంది.. కార్తీక్ దీపని బయటకు తీసుకుని వెళ్లాడని తెలిసీ.. నేనే తీసుకుని వెళ్ళమని చెప్పాను అంటుంది. దీప ఆరోగ్యం బాగోలేనప్పుడు పంతం ఎందుకు ఎంతైనా సొంత భార్యభర్తలు కదా. అని మోనిత చెబుతుంది. కాఫీతాగి వెళ్ళు అంటున్న సౌందర్య తో నేను ఇక్కడికి వచ్చింది దీపని నేను హాస్పెటల్‌కి తీసుకుని వెళ్దామని.. పోనీలే ఆంటీ నేను వచ్చిన పని అయిపోయింది. వెళ్తాను. అంటూ వెళ్లిపోతున్న మోనిత చూస్తూ.. సౌందర్య.. మోనిత మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తుందా అని ఆలోచిస్తుంది.

కార్తీక్ దీపని హాస్పటల్ కి తీసుకుని వెళ్తాడు.. ఇంతలో కార్తీక్ కి ఫోన్ వస్తే.. అది మోనిత చేసిందేమో అని చూస్తుంటే.. కార్తీక్ ఫోన్ చేసింది ఎవరో చూపించి మాట్లాడడానికి వెళ్తాడు . ఇంతలో డాక్టర్ మాలతి వచ్చి.. దీపని పలకరిస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. మాలతి వంటను లాబ్ గా చేసి ప్రయోగం చేస్తున్నావట అంటూ .. అసలు దీపతో తనకి వంట రాదు తెలుసా అంటాడు. మాలతి కి దీపని చూపిస్తూ. .ఈమె నిక్ నేమ్ ఏమిటో తెలుసా. .వంటలక్క .. వంట బాగా చేస్తాడు అనడంతో.. ఈమె మీ వంటమనిషా అంటే.. కాదు నా భార్య అంటూ డాక్టర్ మాలతికి పరిచయం చేస్తాడు..

నా భార్య అంటూ డాక్టర్ మాలతికి పరిచయం చేస్తాడు.. ఈ విషయం తెలిస్తే మోనిత ఏమి ప్లాన్ చేస్తుంది. సౌందర్య ఇంట్లో సందడి ఎలా ఉంటుంది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..!





























