ఆ రోజునే నా విలసవంతమైన జీవితాన్ని త్యజించాను.. ఎందుకంటే ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం.. బాబా రామ్ దేవ్..

Indian Idol 12: బాబా రామ్ దేవ్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. హిందీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 12కు శ్రీరామనవమి సందర్బంగా రామ్ దేవ్ బాబా ముఖ్య అతిదిగా వచ్చారు.

  • Rajitha Chanti
  • Publish Date - 10:30 pm, Wed, 14 April 21
ఆ రోజునే నా విలసవంతమైన జీవితాన్ని త్యజించాను.. ఎందుకంటే ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం.. బాబా రామ్ దేవ్..
Ramdev Baba

Indian Idol 12: బాబా రామ్ దేవ్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. హిందీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 12కు శ్రీరామనవమికి ప్రసారమయ్యే ఎపిసోడ్‌కి రామ్ దేవ్ బాబా ముఖ్య అతిదిగా వచ్చారు. ఇందుకు సంభించింన ప్రోమోను విడుదల చేసింది షో టీం. ఈ వీడియో రామ్ దేవ్ బాబా తన జీవితంలో ఎందుకు సన్యాసిగా మారాల్సి వచ్చిందనే విషయాల గురించి చెప్పుకోచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్లను దీవించారు. దాదాపు 27 సంవత్సరాల కిందట శ్రీరామ నవమి రోజున తన జీవితంలోని అన్ని విలాసాలను వదిలిపెట్టానని తెలిపారు.

శ్రీరామ నవమి శుభదినం.. అందుకే ఆరోజున భక్తి మార్గంలో నడవాలని.. సమాజనికి పిలుపునిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా యోగా విశిష్టత తెలియాలని.. అందులో భాగాంగానే పతంజలి రూపుదిద్దుకుందని తెలిపారు. శ్రీ రామ నవమి రోజున తన జీవితంలోని అన్ని విలాసాలను వదిలిపెట్టి సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నట్లు బాబా అన్నారు. బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ, “27 సంవత్సరాల క్రితం, రామ్ నవమి సందర్భంగా, నా జీవితాన్ని సరళమైన రీతిలో గడపాలని .. అన్ని సౌకర్యాలను వదిలివేయాలని నిర్ణయించుకున్నాను. రామ నవమి నా గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఈ రోజు నాకు కొత్త జన్మనిచ్చింది. నేను సరళంగా జీవించడం ప్రారంభించాను. ఈరోజు ఇండియన్ ఐడల్లో పాల్గోన్న అందరికి నా ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది మధురమైన రోజు. మీ అందరికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Also Read: Tamil New Year 2021: సంప్రదాయపు దుస్తుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కీర్తి సురేష్..

ఎన్టీఆర్ కోసం మహేష్ హీరోయిన్.. ప్లాన్ చేస్తోన్న చిరు డైరెక్టర్.. మరోసారి తెలుగులోకి ముంబై బ్యూటీ..

సాయిపల్లవి అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్.. రానా దగ్గుపాటి ‘విరాట పర్వం’ వాయిదా..

కత్రినా కైఫ్ గురించి మనసులో మాటను బయటపెట్టిన విరాట్… నెట్టింట్లో వైరల్‏గా మారిన కోహ్లీ వీడియో..