ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్.. పది జిల్లాల్లో నైట్ క‌ర్ఫ్యూ.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్

ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్.. పది జిల్లాల్లో నైట్ క‌ర్ఫ్యూ.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్
Night Curfew Imposed In Lucknow And Varanasi

Night Curfew in UP: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. నిత్యం లక్షల్లో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

Balaraju Goud

|

Apr 15, 2021 | 3:53 PM

Night curfew in UP: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. నిత్యం లక్షల్లో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు కరోనా కట్టడికి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ ఇదివరకెప్పుడూ లేనంతగా విజృంభిస్తోండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు లక్షలోపే నమోదవుతూ వచ్చిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. సెకెండ్ వేవ్‌లో అసాధారణంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరువ అయ్యేలా కనిపిస్తున్నాయి.

అటు ఉత్తర్ ప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్, ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క రోజు వ్యవధిలో 20 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ల‌క్నో, వార‌ణాసి స‌హా ప‌ది జిల్లాల్లో నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌ని గురువారం నిర్ణయించింది. రెండు వేల‌కు పైగా యాక్టివ్ కేసులున్న జిల్లాల్లో నైట్ క‌ర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ల‌క్నో, ప్రయాగ‌రాజ్, వార‌ణాసి, కాన్పూర్, గౌతంబుద్ధన‌గ‌ర్, ఘజియాబాద్, మీర‌ట్, గోర‌ఖ్ పూర్ స‌హా ప‌ది జిల్లాల్లో నైట్ క‌ర్ఫ్యూ త‌క్షణ‌మే అమ‌ల‌వుతుంద‌ని యూపీ సీఎం కార్యాల‌యం వెల్లడించింది.

క‌ర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఏడు గంట‌ల వ‌ర‌కూ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొంది. ఇక మే 15 వ‌ర‌కూ స్కూళ్లను మూసివేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మే 20 వ‌ర‌కూ ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్షల‌ను వాయిదా వేసింది. యూపీలో నిన్న ఒక్కరోజే రికార్డు స్ధాయిలో ఏకంగా 20,510 పాజిటివ్ కేసులు వెలుగుచూడ‌టంతో రాత్రివేళ‌ల్లో క‌ర్ఫ్యూ విధించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read Also…  CM Jagan: ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ రివ్యూ.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వార్నింగ్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu