CM Jagan: ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ రివ్యూ.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వార్నింగ్

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఒక్కరోజులోనే 6 లక్షల 4 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు.

CM Jagan: ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ రివ్యూ.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వార్నింగ్
Andhrapradesh CM YS Jagan
Follow us

|

Updated on: Apr 15, 2021 | 3:40 PM

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఒక్కరోజులోనే 6 లక్షల 4 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఇదే తరహాలో వ్యాక్సినేషన్‌ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అదనపు వ్యాక్సిన్‌ డోసుల కోసం కేంద్రాన్ని కోరాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌పై మరింత దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. ఏపీలో అందుబాటులో ఉన్న ఆక్సీజన్‌ బెడ్స్‌పై కూడా ఆరా తీశారు సీఎం. మరిన్ని బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు రెమిడెసివిర్‌ లభ్యతపై కూడా ఆరా తీశారు ముఖ్యమంత్రి. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ప్రజలను దోచుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఫిక్స్‌ చేసిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 108 కొవిడ్‌ హాస్పిటల్స్‌ ఉండగా, వాటిని 230కి పెంచాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌.

Also Read: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్

పొట్టు, పొట్టు కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. రీజన్ ఎంత సిల్లీనో తెలుసా..?