Viral News: పొట్టు, పొట్టు కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. రీజన్ ఎంత సిల్లీనో తెలుసా..?
పోలీసులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. సిట్యూవేషన్ ఎలాంటిది అయినా సహనంతో వ్యవహరించాలి. నలుగురికి తప్పు ఏదో, ఒప్పు ఏదో చెప్పాల్సిన...
పోలీసులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. సిట్యూవేషన్ ఎలాంటిది అయినా సహనంతో వ్యవహరించాలి. నలుగురికి తప్పు ఏదో, ఒప్పు ఏదో చెప్పాల్సిన ఖాకీలే దారితప్పితే.. నవ్వులపాలు కావడం తప్ప మరొకటి ఉండదు. తాజాగా ఝార్ఖండ్‌లో ఇద్దరు పోలీసులు హద్దుమీరారు. నడిరోడ్డుపై ఘర్షణకు దిగారు. హెల్మెట్ ధరించలేదనే ఆగ్రహంతో ఓ ట్రాఫిక్ పోలీస్.. మరో పోలీస్‌పై విరుచుకుపడ్డాడు. ఝార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
అసలు ఏం జరిగిందంటే.?
రాంచీలోని సహజానంద్ చౌక్ దగ్గర్లో ఓ పోలీస్ హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నారు. ఇది గమనించిన అక్కడి ట్రాఫిక్ పోలీస్.. ఆయన వాహనాన్ని ఆపి ఫైన్ వేశాడు. దానికి పోలీస్ అధికారి నిరాకరించారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ట్రాఫిక్ పోలీసు ఆయన్ను వెంబడించి నడిరోడ్డుపైనే దాడి చేశారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల.. విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై విచారణ జరిపి త్వరలోనే చర్యలు తీసుకుంటామని రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామన్న ఆయన.. దోషులెవరో తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read: హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి సివిల్ పోస్టులే అని స్పష్టం
కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ.. 10 ఎకరాల భూమిని బాడిగకు తీసుకుని వ్యవసాయం