AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో కలకలం రేగింది. అనుమానాస్పదంగా పడి ఉన్న బ్యాగులో మృతదేహం లభ్యమైంది. నడుమూరు సమీపంలోని...

AP Crime News: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్
Unknown Dead Body Found
Ram Naramaneni
|

Updated on: Apr 15, 2021 | 12:27 PM

Share

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో కలకలం రేగింది. అనుమానాస్పదంగా పడి ఉన్న లగేజీ బ్యాగులో మృతదేహం లభ్యమైంది. నడుమూరు సమీపంలోని కుప్పం-కృష్ణగిరి నేషనల్ హైవే పక్కన అనుమానాస్పదంగా బ్యాగును గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. బ్యాగును చెక్ చేయగా.. మృతదేహం సగభాగం లభ్యమైంది. నడుము నుంచి కింద కాళ్ల వరకు బ్యాగులో కుక్కి ఖాళీ ప్రదేశంలో పడేశారు. మిగతా సగభాగం కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. కానీ పరిసర ప్రాంతాలలో ఆచూకి కనిపించలేదు. డెడ్‌బాడీని కుప్పం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో మహిళపై హత్యాయత్నం…

ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని రాయవరంలో మహిళపై హత్యాయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి రాజు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హోటల్ ఓనర్ రమణమ్మపై నిందితుడు రాజు కత్తితో గొంతుపై దాడికి యత్నించగా… బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పొట్టు, పొట్టు కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. రీజన్ ఎంత సిల్లీనో తెలుసా..?

హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి సివిల్‌ పోస్టులే అని స్పష్టం