షాకింగ్ న్యూస్ : విశాఖలో ఎన్నారై ఫ్యామిలీ మర్డర్ ఉదంతం : హత్యలకు కారణం పెద్ద కొడుకు దీపక్ గా అనుమానం
NRI family murder : విశాఖపట్నంలోని అపార్ట్ మెంట్‌లో మంటలకు ఫ్యామిలీలోని నలుగురు చనిపోయారన్న ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
NRI family murder : విశాఖపట్నంలోని అపార్ట్ మెంట్‌లో మంటలకు ఫ్యామిలీలోని నలుగురు చనిపోయారన్న ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు పక్కింటి ఫ్లాట్ వాసులు చెబుతున్నారు. హత్యలకు కారణం పెద్ద కొడుకు దీపక్ గా అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, ఎన్నారై బంగారు నాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా గంట్యాడ అని.. బంగారు నాయుడు గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొన్నారని సీపీ మనీష్ కుమార్ చెప్పారు. ఈ హత్యలకు కారణం బంగారు నాయుడు పెద్ద కొడుకు దీపక్ గా అనుమానిస్తున్నామని సీపీ చెప్పారు. తల్లిని, తండ్రిని, తమ్ముడిని చంపి, పెద్దకుమారుడు దీపక్ తనను తాను నిప్పు అంటించుకున్నట్టు అనుమాన ఆయన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడి తో దీపక్ కుటుంబ సభ్యులతో గొడవ పడ్డట్టు అనుమానం వ్యక్తం చేశారు సీపీ. మిగతా ముగ్గురికి వంటి నిండా గాయాలున్నాయ్. దీపక్ ఒక్కడే నిప్పంటించుకున్నాడు. దీపక్ ఎన్ ఐ టీ లో ఇంజనీరింగ్ చేసి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. పెద్ద కొడుకు దీపక్ మానసిక పరిస్థితిపై అనుమానాలున్నాయ్. తెల్లవారుఝామునుంచే ఇంట్లో గొడవ అవుతున్నట్టు పక్కింటివాళ్ళు చెప్పారు. అని సీపీ వెల్లడించారు.
కాగా, విశాఖలోని స్థానిక మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్‌గా గుర్తించారు. బాధిత కుటుంబం ఒక ఎన్నారై ఫ్యామిలీ. వీళ్లు 8 నెలల క్రితమే అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.