‘లక్ష రూపాయలు కడితే.. నెలకు 30 వేలు వడ్డీ’.. అనంతపురం జిల్లాలో ప్రజలను నిండా ముంచేశారు
లక్ష రూపాయలు కట్టండి.. నెల నెలా 30 వేలు తీసుకోండి..ఆ తర్వాత అసలు కూడా మీరే తీసుకోండి. ఇది ఓ కంపెనీ ప్రకటన..
లక్ష రూపాయలు కట్టండి.. నెల నెలా 30 వేలు తీసుకోండి..ఆ తర్వాత అసలు కూడా మీరే తీసుకోండి. ఇది ఓ కంపెనీ ప్రకటన.. వినగానే ఎంతో ఆశ కలిగింది. అయితే, ఈ ప్రకటన చూసి వందల సంఖ్యలో జనం లక్ష రూపాయలు సమర్పించుకున్నారు. అయితే, కాస్త లేట్‌గా అర్థమైంది. ఇదంతా బోగస్ అని. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. డబ్బు కట్టించుకున్న ఏజెంట్లు, కంపెనీ రెండు మోసం చేశాయని ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలో జరిగిన మోసంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ధర్మవరం పరిసర ప్రాంతాల్లోని నాగ్‌పూర్‌కు చెందిన ఈబీఐడీడీ ట్రేడర్స్ పేరుతో ఓ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్ కంపెనీ బురిడీ కొట్టించింది. ముందుగా ఆ కంపెనీ ఇదే ప్రాంతానికి చెందిన కొందరిని ఏజెంట్లుగా నియమించుకుని ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. మీ వద్ద ఉన్న డబ్బు మా కంపెనీకి కట్టండి. నెలకు ఒక లక్షకు 30 వేల చొప్పున చెల్లిస్తాం. పది నెలల తరువాత అసలు మొత్తం కూడా చెల్లిస్తాం అని నమ్మించారు.
జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు, కొందరు ఉద్యోగుల నుంచి లక్షల్లో కట్టించుకున్నారు. ఒకటి రెండు నెలలు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి..ఆ తర్వాత ఏజెంట్లు మాయమయ్యారు. తీరా కంపెనీ దగ్గరికి వెళ్తే..ఏం సంబంధం లేదని చెప్పారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మవరం రూరల్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు.
Also Read: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్
పొట్టు, పొట్టు కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. రీజన్ ఎంత సిల్లీనో తెలుసా..?