Telangana Elections: తెలంగాణలో మరో ఓట్ల పండుగ.. కదనోత్సాహంతో రాజకీయ పార్టీలు
తెలంగాణలో మరో ఓట్ల పండుగకు నగారా మోగింది. ఓవైపు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పర్వం కొనసాగుతుండగానే రాష్ట్రంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, అయిదు…
Telangana Elections Parties Preparation: తెలంగాణలో మరో ఓట్ల పండుగకు నగారా మోగింది. ఓవైపు నాగార్జున సాగర్ (NAGARJUNSAGAR) అసెంబ్లీ (ASSEMBLY) నియోజకవర్గానికి ఉప ఎన్నిక (BY-ELECTION) పర్వం కొనసాగుతుండగానే రాష్ట్రంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు (MUNICIPAL CORPORATIONS), అయిదు మునిసిపాలిటీ (MUNICIPALITY)లకు ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం (STATE ELECTION COMMISSIONER) ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ (GREATER WARANGAL), ఖమ్మం (KHAMMAM) నగర పాలక సంస్థలతోపాటు సిద్దిపేట (SIDDIPET), అచ్చంపేట (ACHCHAMPET), నకిరేకల్ (NAKIREKAL), జడ్చర్ల (JADCHARLA), కొత్తూరు (KOTTUR) పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు ఏప్రిల్ 22వ తేదీ గడువు కాగా.. ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే మూడో తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు షెడ్యూలు గురువారం (ఏప్రిల్ 15న) స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విజయానంద్ (VIJAYANAND) ప్రకటించారు.
ఎన్నికలు జరగనున్న ఏడు చోట్లకు గాను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (GREATER WARANGAL MUNICIPAL CORPORATION) ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా వుంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) చరిత్రను ఓసారి చూస్తే.. వరంగల్ మునిసిపాలిటీ (WARANGAL MUNICIPALITY) 1934లో ఏర్పాటైంది. అయితే.. 1952లో వరంగల్ మునిసిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1959 జులైలో స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా మారింది. 1960 జులైలో సెలెక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీగా మార్పు చేశారు. 1994 ఆగస్టు 18న నగర పాలక సంస్థగా మారింది చారిత్రక ఓరుగల్లు. 2015 జనవరి 42 గ్రామపంచాయతీలను వరంగల్‌లో విలీనం చేస్తూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చింది తెలంగాణ ప్రభుత్వం (TELANGANA GOVERNMENT).
ఆ తర్వాత కేంద్రంలో ఏర్పాటైన నరేంద్ర మోదీ (NARENDRA MODI) ప్రభుత్వం వరంగల్ (WARANGAL) నగరాన్ని స్మార్ట్ సిటీ (SMART CITY)గా ఎంపిక చేసింది. అనంతరం 2016లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) పార్టీ 44 కార్పొరేటర్లను గెలిపించుకుని గ్రేటర్ వరంగల్ మేయర్ (MAYOR) పీఠాన్ని కైవసం చేసుకుంది. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4, బీజేపీ 1, సీపీఐ 1, ఇతరులు 8 డివిజన్లలో విజయం సాధించారు. ప్రస్తుతం నగర పాలక సంస్థగా ఎన్నికలకు వెళుతున్న మరో నగరం ఖమ్మం. ఖమ్మం మునిసిపాలిటి తొలుత 1952లో మూడో గ్రేడు పురపాలక సంఘంగా ఏర్పాటైంది. 1959లో 2వ గ్రేడు మునిసిపాలిటీ అప్ గ్రేడ్ అయ్యింది. 1980లో 1వ గ్రేడు మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ అయ్యింది. 2001 మే 18 ఖమ్మంను స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా మార్చారు. అక్టోబర్19, 2012న ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖమ్మంను నగర పాలక సంస్ధగా మార్చింది. నగర పాలక సంస్థగా మారిన నాలుగేళ్ళకు ఖమ్మంకు తొలి ఎన్నికలు జరిగాయి. 2016 మార్చి ఆరో తేదీన ఖమ్మం నగర పాలక సంస్థకు తొలి ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల్లో 50 డివిజన్లు మాత్రమే వుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 60కి చేరింది.
ఇక ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీల విషయానికి వస్తే.. సిద్దిపేట మునిసిపాలిటీ ప్రతిష్టాత్మకంగా కనిపిస్తోంది. 1952లో మునిసిపాలిటీగా అవతరించిన సిద్దిపేటలో ప్రస్తుతం 34 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పట్నించీ ఆ పార్టీకే పట్టం కడుతున్న సిద్దిపేట పురపాలక ఓటర్లు ఈసారి అలాగే స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి వుంది. తొలుత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KALVAKUNTLA CHANDRA SHEKHAR RAO), ఆ తర్వాత తన్నీరు హరీశ్ రావు (TANNIRU HARISH RAO) సిద్దిపేట నుంచి వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అయిదు మునిసిపాలిటీలలో మూడు ఉమ్మడి మహబూబ్‌నగర్ (MAHBUBNAGAR) జిల్లాకు చెందినవి. ఇందులో అచ్చంపేట మునిసిపాలిటీ 2013 జూన్ 25న ఏర్పాటైంది. మొత్తం 20 వార్డులకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జడ్చర్ల మున్సిపాలిటీకి కూడా ప్రస్తుతం ఎన్నికలు జరగుతున్నాయి. జడ్చర్ల 2018లో మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. నిజానికి 2012లోనే జడ్చర్లను మునిసిపాలిటీగా మార్చబోయారు. కానీ విలీన గ్రామాల ప్రజలు కోర్టుకెక్కడంతో ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2018లో జడ్చర్ల మునిసిపాలిటీగా మారింది. అయితే.. అప్పటికి గ్రామపంచాయితీ పదవీ కాలం పూర్తి కాలేదు. జడ్చర్ల మునిసిపాలిటీలో విలీనమైన కావేరమ్మపేట గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవీ కాలం 2020 డిసెంబర్‌లో పూర్తి కావడంతో జడ్చర్ల మునిసిపాలిటీ ఎన్నికలకు లైన్ క్లియరైంది. హైదరాబాద్ – షాద్ నగర్ మధ్య అనూహ్య వేగంతో ఎదిగిన కొత్తూరు మునిసిపాలిటీకి కూడా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినపుడు మండల కేంద్రంగా మారిన కొత్తూరు ఆ తర్వాత కొంత కాలానికే మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. కొత్తూరు మండలకేంద్రానికి సమీపంలో వున్న 10 గ్రామాలను ఇందులో విలీనం చేసి మునిసిపాలిటీగా మార్చారు.
ఇక నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీకి కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 2020 డిసెంబర్ 16వ తేదీన నకిరేకల్‌ను మునిసిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నిజానికి 2011లోనే నకిరేకల్ మునిసిపాలిటీగా గుర్తింపు పొందింది. కానీ.. నకిరేకల్ మునిసిపాలిటీలో విలీనమైన తాటికల్, కడపర్తి, నెల్లిబండ, చందంపల్లి,చందుపట్ల, నోముల గ్రామాలల ప్రజలు మునిసిపల్ పన్నులను చెల్లించలేమంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో 2013 సెప్టెంబర్‌లో నకిరేకల్ మునిసిపాలిటీ రద్దు అయ్యింది. గ్రామపంచాయతీగానే ఉంచాలన్న హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 2014 ఫిబ్రవరిలో నకిరేకల్‌ను తిరిగి గ్రామపంచాయితీగా మార్చారు. దాంతో 2015 డిసెంబర్‌లో నకిరేకల్ మేజర్ గ్రామపంచాయితీతోపాటు ఆరు విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించారు. అనంతరం 2018లో నకిరేకల్‌ను మునిసిపాలిటీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం విలీన గ్రామాలతో కలిసి ఏర్పాటైన నకిరేకల్‌ను ఎన్నికలు జరుగుతున్నాయి.