Pawan Kalyan Letter : బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిని రత్నప్రభను గెలిపించండని పవన్ బహిరంగ లేఖ

Pawan Kalyan Letter : తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు ఓటు వేసి గెలిపించాలని తిరుపతి ఓటర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు...

Pawan Kalyan Letter :  బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిని రత్నప్రభను గెలిపించండని పవన్ బహిరంగ లేఖ
Janasena Party Pawan
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 15, 2021 | 5:08 PM

Pawan Kalyan Letter : తిరుపతి పార్లమెంటు స్థానం బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు ఓటు వేసి గెలిపించాలని తిరుపతి ఓటర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. పార్లమెంటులో బలంగా గొంతుక వినిపించి, ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి వివరించి నిధులు తీసుకురాగల సత్తా ఉన్నవాళ్లనే ఎంపీగా ఎన్నుకోవాలని ఓటర్లకు జనసేనాని సూచించారు. అలాంటి శక్తిసామర్థ్యాలు రత్నప్రభకు ఉన్నాయని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే రత్నప్రభకే ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు. గతంలో రత్నప్రభ ఐఏఎస్ అధికారిణిగా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారని.. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారని.. తిరుపతి ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం రత్నప్రభనే గెలిపించాలని పవన్ కోరారు. అంతేకాదు, ఇతర పార్టీల అభ్యర్థులు వారి పార్టీ పెద్దల సేవలోనే తరిస్తారని, ప్రజాసేవను విస్మరిస్తారని అది గుర్తించుకొని ఓటెయ్యాలన్నారు. రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నందున తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని ఓటర్లు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పవన్ తెలిపారు.

Read also : Visakha murders : అప్పలరాజు కుటుంబంపై బాధిత బంధువుల ఆగ్రహావేశాలు, ఆరు హత్యల వెనుక కారణాలు..