AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కూతురు పరీక్ష ఫీజు చెల్లించడానికి కిడ్నీలు అమ్ముకుంటాం.. అనుమతివ్వండి అంటూ ప్రభుత్వానికి వినతి

Andhra Pradesh: : ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను మంచి చదువులు చదివించాలి.. సమాజంలో వారిని ఉన్నత స్థాయిలో చూడాలి అని కోరుకుంటారు. అందుకు ఎంతటి కష్టాన్ని..

Andhra Pradesh: కూతురు పరీక్ష ఫీజు చెల్లించడానికి కిడ్నీలు అమ్ముకుంటాం.. అనుమతివ్వండి అంటూ ప్రభుత్వానికి వినతి
Daughter's Fee
Surya Kala
|

Updated on: Apr 15, 2021 | 1:17 PM

Share

Andhra Pradesh: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను మంచి చదువులు చదివించాలి.. సమాజంలో వారిని ఉన్నత స్థాయిలో చూడాలి అని కోరుకుంటారు. అందుకు ఎంతటి కష్టాన్ని అయినా పడతారు. తమ ఆస్తులను అమ్ముకోవడానికి కూడా వెనుకాడరు.. అయితే తాజాగా తమ కూతురు ఎంబీబీఎస్ చదువు కొనసాగించడానికి పరీక్ష పీజు కట్టేందుకు డబ్బులు లేక తమ అవయవాలను అమ్ముకోవడానికి అనుమతిని కోరుతున్నారు.. ఈ ఘటన అనంతరపురంజిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అనంతరపురం జిల్లా హిందూపురానికి చెందిన మక్బుల్‌జాన్ దంపతులు తమ కుమార్తె రుబియాను ఎంబీబీఎస్ చదివించడానికి 16 నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ పంపించారు. ప్రస్తుతం కుమార్తె వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. విదేశీ విద్యకు ప్రభుత్వం అందించే సాయంతో చదువు పూర్తి చేసుకుందని భావించి ఆ తల్లిదండ్రులు తమ కుమార్తె ను విదేశాలకు పంపించారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో కూతురిని ఎంబీబీఎస్‌ చదివేందుకు 16 నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ పంపించారు. ప్రస్తుతం కుమార్తె వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చదువుకోసం ఏపీ ప్రభుత్వం నుంచి ఉపకారవేతనం ఇప్పటి వరకూ అందలేదు. దీంతో పిల్ల చదువుకోసం ఇల్లు అమ్మాలి అనుకున్నారు.. దానికి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో తమ కుమార్తె చదువు ఆగిపోతుందని ఆవేదన చెందిన తల్లిదండ్రులు.. చివరకు తమ కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు.

కూతురు ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కట్టేందుకు డబ్బుల్లేక కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు దంపతులు మొరపెట్టుకున్నారు. అయితే తమ కుమార్తె చదువుకు ఆర్ధిక సాయం అందించండి అంటూ.. మక్బుల్‌జాన్‌ గత రెండు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. ఇప్పటికే ఈ విషయంపై హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర దీక్ష కూడా చేశారు. దీంతో న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో అప్పట్లో దీక్ష విరమించారు. కానీ, ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదు.

అయితే, పరీక్షలు రాయాలంటే ఈ నెల 17వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ, అధికారుల నుంచి ఉపకార వేతనం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారమూ అందలేదని మక్బుల్‌జాన్‌ వాపోయారు. ఒకవేళ, ప్రభుత్వం స్కాలర్‌షిప్ మంజూరు చేయకపోతే.. తమ కిడ్నీలు అమ్ముకుని కూతురు ఫీజు చెల్లించుకుంటానని మక్బుల్ జాన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని.. లేకుంటే కనీసం తమ కుమార్తె విద్య కోసం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

Also Read: ఉద్యోగులకు గుడ్ న్యూస్… జీతాలను పెంచడానికి చూస్తున్న కొన్ని కంపెనీలు.. ఏయే రంగాల్లో అంటే..!

కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే