AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Future reliance deal: ఫ్యూచర్ గ్రూపుతో డీల్ వివాదంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన అమెజాన్!

ఫ్యూచర్ రిటైల్ తో అమెజాన్ వివాదం ఇంకా సర్దుమణగలేదు. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్చేంజీ లకు సమర్పించిన ఫైలింగ్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ తెలిపింది. అమెజాన్ ఈ వివాదం విషయంలో సుప్రీంకోర్టును అశ్రయించినట్టు పేర్కొంది.

Future reliance deal: ఫ్యూచర్ గ్రూపుతో డీల్ వివాదంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన అమెజాన్!
Future reliance deal
KVD Varma
|

Updated on: Apr 15, 2021 | 1:16 PM

Share

Future reliance deal: ఫ్యూచర్ రిటైల్ తో అమెజాన్ వివాదం ఇంకా సర్దుమణగలేదు. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్చేంజీ లకు సమర్పించిన ఫైలింగ్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ తెలిపింది. అమెజాన్ ఈ వివాదం విషయంలో సుప్రీంకోర్టును అశ్రయించినట్టు పేర్కొంది. ఈ వివాదం వివరాలు ఇలా ఉన్నాయి. అమెజాన్ ఫ్యూచర్ గ్రూపునకు చెందిన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్‌సీపీఎల్‌) లో కొంత వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఎఫ్‌సీపీఎల్‌ కు ఫ్యూచర్ రిటైల్ లో వాటాలు ఉన్నాయి. దీంతో అమెజాన్ కూడా ఫ్యూచర్ రిటైల్ లో స్వల్ప వాటాదారుగా మారింది. ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కున్న ఫ్యూచర్ రిటైల్ తన వ్యాపారాన్ని దాదాపు 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించడానికి ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ అనుమతుల కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే, ఇది తమతో కుదుర్చుకున్న ఒప్పందాలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. అమెజాన్ కు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల అమలు కోసం అమెజాన్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది. దీంతో సింగిల్ జడ్జి యధాతథ స్థితి కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. వీటిపై ఎఫ్‌ఆర్‌ఎల్‌.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ లో అప్పీలు చేసింది. అయితే, అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్‌ ఒప్పంద నిబంధనలు, ఆర్‌ఐఎల్‌-ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్‌ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇపుడు వీటిపై అమెజాన్ సుప్రీంకోర్టును ఆదేశించింది. అమెజాన్‌ వేసిన అప్పీల్‌ విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కేసులో తుది తీర్పును ఇచ్చింది. గ్రూప్‌ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్‌ విబేధాలకు సంబంధించి సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్‌ (ఈఏ) 2020 అక్టోబర్‌ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్‌ గ్రూప్‌ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా ఫ్యూచర్‌ గ్రూప్‌ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్‌ గ్రూప్‌ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్‌’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్‌ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్‌ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్‌ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 28వ తేదీన ఈ కేసు విషయంలో హాజరుకావలని ప్రమోటర్‌ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది.

సింగపూర్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నించిన సింగిల్ జడ్జి రెండువారాలలోపు సమాధానం ఇవ్వాలని చెపింది. కేసు విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ తీర్పుపై ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ స్టే ఇవ్వడంతో అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.