Sonu Sood : బ్యాండ్ వాలాగా మారిన రియల్ హీరో.. సోనులోని టాలెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్…
లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనుసూద్ దేశమంతా ప్రసంశలతో ముంచెత్తుతుంది.
Sonu Sood :
లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనుసూద్ దేశమంతా ప్రసంశలతో ముంచెత్తుతుంది. షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ ప్రజాసేవ మరిచిపోవడం లేదు. తనను స్ఫూర్తిగా తీసుకుని సేవలు చేస్తున్న వారిని సైతం కలుస్తూ వారికి సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. అంతే కాదు ఇటీవల షూటింగ్ సమయంలో రుచికరమైన దోశలు కూడా వేసాడు ఈ రియల్ హీరో.
తాజాగా మరో వీడియోను షేర్ చేసారు సోనూసూద్ ఈ సారి ఆయన డోలు వాయిస్తూ సందడి చేశారు. పెళ్లి బజంత్రీలలో ఉపయోగించే డోలు వాయిస్తూ ఆకట్టుకున్నారు సోను. పెళ్ళిళ్ళల్లో బజంత్రీలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ సరదాగా వాయిద్యకారులతో కలిసి బజంత్రీలు వాయించాడు సోనూసూద్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. సోనూసూద్ లో మరో టాలెంట్ అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..
మరిన్ని ఇక్కడ చదవండి :