- Telugu News Photo Gallery Spiritual photos Ramadan 2021 healthy and nutritious recipes for iftar and sehri in ramzan
Ramadan 2021: రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేస్తున్నారా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇఫ్తార్ విందులో వీటిని చేర్చుకుంటే సరి
Ramazan 2021: ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను ఆచరిస్తారు. అలా ఈ కేలండర్ లోని 9వ నెల రంజాన్. ఈ మాసంలో ఖురాన్ గ్రంధం ఆరభించిందని అందుకనే ఈ మాసాన్ని అతిపవిత్రమైన మాసంగా ముస్లింలు భావిస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ నెల. ఇక నెలలో ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షను చేపడతారు.
Updated on: Apr 16, 2021 | 1:12 PM

రంజాన్ నెలలో చిన్న, పెద్ద, ముసలి అనే తారతమ్యం లేకుండా భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ప్రతి రోజూ సూర్యోదయం కంటే ముందు ఉపవాస దీక్ష చేపట్టి.. సూర్యాస్తమయం వరకు ఉంటారు. ఈ సమయంలో నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగ కుండా కఠోర ఉపవాస దీక్ష చేస్తారు. ఇలా ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని వైద్యశాస్త్రం చెబుతుంది. ఇక ఉపవాస దీక్షలు రోజా .. సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తుంది.

రంజాన్ మాసంలో చేసే ఇఫ్తార్ సమయం లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ కరోనా సమయంలో ..కనుక ఈ నెలలో దీక్ష చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజంతా ఏమీ తినకుండా ఉండే ముస్లింలు ఇఫ్తార్ సమయంలో ఈ స్నాక్స్ ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిస్తాయి. సులభంగా చేసుకోవచ్చు.

విందులో బ్రౌన్ రైస్ ఐటెం ను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారం..కనీసం ఉమ్మికూడా మింగని కఠిన దీక్ష.. దీనితో ఇఫ్తార్ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇఫ్తార్ విందులో రుచి , ఆరోగ్యాన్ని ఇచ్చే దానిమ్మ లేదా పైనాపిల్ రైతాని చేర్చుకోవచ్చు. వీటిల్లో ఎక్కువ శక్తినిచ్చే ప్రొటీన్స్ ఉంటాయి. తయారీ కూడా చాలా సులభం. అనాస పండు లేదా దానిమ్మ ని కట్ చేసి పెరుగులో వేసి.. వీటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలు. రుచికరమైన రైతా తయారవుతుంది.

ఇఫ్తార్ వేళలో సలాడ్స్ ను కూడా తీసుకోవాలి. దాదాపు నెలరోజుల పాటు సాగె ఉపవాస దీక్షలో సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.

ముస్లింలు ఉపవాస దీక్షను విరమించడానికి తీసుకునే ఇఫ్తార్ లో షమ్మీ కబాబ్ ను చేర్చుకోండి. ఇది రంజాన్ నెలలో చాలా ఫేమస్. దీనిని మటన్ మరియు చికెన్ తో తయారు చేస్తారు. కానీ ఇఫ్తార్ వేళల్లో వీటిని చికెన్ తో ఎక్కువగా తయారు చేస్తారు. ఎందుకంటే చికెన్ లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి మరియు అవసరమైన అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి.




