అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్..

మగువా.. మగువా’ పాట.. ఫీమేల్ వర్షన్‌ని లిరికల్ సాంగ్‏ను విడుదల చేసింది వకీల్ సాబ్ చిత్రయూనిట్.

అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న 'మగువా మగువా' ఫీమేల్ వెర్షన్..
Maguva Maguva Song Female V
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2021 | 8:39 AM

‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహానానికి సరిహద్దులు కలవా… అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా.. అలుపని రవ్వంతా అననే అనవంటా.. వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా’.. గతేడాది అంతార్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వచ్చిన వకీల్ సాబ్ సినిమా విడుదల కంటే ముందే ఈ సాంగ్ యూట్యూబ్‏లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇటీవల ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో దూసుకుపోతుంది. ఇందులో పవన్‏తోపాటు కీలక పాత్రల్లో నటించిన నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాకు మరో బలం థమన్ అందించిన మ్యూజిక్. తాజాగా ఈ సినిమా ప్రమెషన్‌లో భాగంగా సెకండాఫ్‌లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించారు. అన్నట్లుగానే సినిమా రెండో భాగంలో ‘మగువా.. మగువా’ పాట.. ఫీమేల్ వర్షన్‌ని సినిమాలో చూపించారు.

ఇక తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు.. నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు’.. అంటూ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కోంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఇందులో చూపించారు. అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. నిందలు వేస్తారు.. నిను వెలివేస్తారు.. ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు అంటూ సాగే పదాలు గుండెలను పిండేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమాని రూపొందించారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.

వీడియో..

Also Read:  అందుకే అందులో నటించాలని అనిపించలేదు. ‘ది స్లీప్ వాకర్స్’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పిన రాధికా ఆప్టే.. 

‘ఈశ్వరా.. పరమేశ్వరా’ నాట్యం కోసం బేబమ్మ ఎంత శ్రద్ధ పెట్టిందో చూశారా.. మేకింగ్ వీడియోను షేర్ చేసిన కృతి..