పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన మురుగదాస్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ ?

పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన మురుగదాస్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ ?
Ar Murugadas

AR Murugadas: విభిన్నమైన స్టోరీలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో ఏఆర్ మురగదాస్ ఒకరు. ‘గజినీ, స్టాలిన్,

Rajitha Chanti

|

Apr 16, 2021 | 1:58 AM

AR Murugadas: విభిన్నమైన స్టోరీలతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో ఏఆర్ మురగదాస్ ఒకరు. ‘గజినీ, స్టాలిన్, తుపాకీ, స్పైడర్, సర్కార్, దర్బార్’ ఇలా డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తాడు మురుగదాస్. తాజాగా మురుగదాస్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించానుకుంటున్నాడట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రస్తావించాడు డైరెక్టర్. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మురుగదాస్ తాను తెరెకెక్కించబోయే పాన్ ఇండియా చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నాడట.

ప్రముఖ హిందీ నిర్మాత ఓం ప్రకాశ్ భట్ నిర్మిస్తున్నా ఈ సినిమాకు 1947 అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా సమాచారం. అయితే మురుగదాస్ సినిమాలతో పాటు అతని సినిమాల టైటిల్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయి.  అయితే ఇందులో నటించబోయే నటీనటులు, సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. మురగుదాస్ సినిమా టైటిల్ గురించి తెలిసిన నెటిజన్లు.. సినిమా బ్యాక్‌డ్రాప్‌ని డీకోడ్ చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. సాధారణంగా 1947 అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవమే. దీంతో ఈ సినిమా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జరిగిన పరిణామాలే బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరీ నిజాంగానే మురుగదాస్ స్వాతంత్ర నేపథ్యంలోని స్టోరీతో రాబోతున్నాడా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్..

‘ఈశ్వరా.. పరమేశ్వరా’ నాట్యం కోసం బేబమ్మ ఎంత శ్రద్ధ పెట్టిందో చూశారా.. మేకింగ్ వీడియోను షేర్ చేసిన కృతి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu