‘ఈశ్వరా.. పరమేశ్వరా’ నాట్యం కోసం బేబమ్మ ఎంత శ్రద్ధ పెట్టిందో చూశారా.. మేకింగ్ వీడియోను షేర్ చేసిన కృతి..

'ఈశ్వరా.. పరమేశ్వరా' నాట్యం కోసం బేబమ్మ ఎంత శ్రద్ధ పెట్టిందో చూశారా.. మేకింగ్ వీడియోను షేర్ చేసిన కృతి..
Krithi Shetty

Krithi Shetty: మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ విజయం

Rajitha Chanti

|

Apr 15, 2021 | 11:38 PM

Krithi Shetty: మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. లవ్, రోమాన్స్‌, ఎమోషన్ కలగలిపిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకంటే ఎక్కువ విజయం సాధించింది. భారీ కలెక్షన్లతో పాటు డెబ్యూ హీరోగా ఎక్కువ కలెక్షన్లు సాధించిన హీరోగా వైష్ణవ్ తేజ్ పేరు సంపాదించుకున్నాడు.

ఇక ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్‌గా నిలిచాయి. ‘జలజలపాతం’ పాటతో పాటు ఈశ్వరా.. పరమేశ్వరా సాంగ్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాలోని ఈశ్వరా.. పరమేశ్వరా సాంగ్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోను హీరోయిన్ కృతిశెట్టి సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

ఈ వీడియోలో చీరకట్టులో కృతిశెట్టి చూడముచ్చటగా చాలా బాగుంది. అచ్చ తెలుగు పిల్లలా చాలా అందంగా కనిపించింది. లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియోలోని కృతిశెట్టి లుక్స్ చూస్తే.. డెబ్యూ హీరోయిన్‌గా అనిపించలేదని, చాలా అనుభవం గల హీరోయిన్ గా నటించిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. హీరోతో పాటు హీరోయిన్ కృతిశెట్టికి కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు టాలీవుడ్ లో వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి.

వీడియో…

Also Read: అందుకే అందులో నటించాలని అనిపించలేదు. ‘ది స్లీప్ వాకర్స్’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పిన రాధికా ఆప్టే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu