అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. చికిత్సకు రూ. 16 కోట్లు.. సాయం చేయాలని విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..

Ajay Devgan: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన అభిమానులు సోషల్ మీడియా ద్వారా

  • Rajitha Chanti
  • Publish Date - 9:24 pm, Thu, 15 April 21
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. చికిత్సకు రూ. 16 కోట్లు.. సాయం చేయాలని విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..
Ajay Devgan

Ajay Devgan: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్ లో ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే సాయం అడిగిన వారికి కాదనకుండా హెల్ప్ చేస్తుంటాడు. లాక్ డౌన్ సమయంలోనూ ఎంతో మంది పేదవారికి సాయాన్ని అందించాడు. తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేయలంటూ తన సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసాడు. అసలు విషయానికి వస్తే.. అయాన్ష్ గుప్తా అనే చిన్నారి… వెన్నెముక కండరాల రెట్రోఫి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ చిన్నారి చికిత్సకు దాదాపు రూ.16 కోట్లు అవసరం పడతాయి. ఈ విషయం తెలుసుకున్న అజయ్ దేవ్ గన్ .. తన ట్విట్టర్ అకౌంట్లో ఈ పిల్లాడి చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ప్రతి ఒక్కరు సాయం చేయాలని కోరాడు.

“అయాన్ గుప్తా.. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్నాడు. ఇతనికి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్ అవసరం. అతని చికిత్సకు సుమారు రూ. 16 కోట్లు అవసరం పడతాయి. మీరు విరాళం ఇవ్వడం ద్వారా అతనికి సహాయం చేసినవారవుతారు. విరాళం చేయడానికి లింక్ ఇస్తున్నాను… ” అంటూ తెలిపాడు. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్ దేవ్ గన్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అజయ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇవే కాకుండా.. అటు బాలీవుడ్ లో భుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలోనూ నటిస్తున్నాడు అజయ్. అలాగే మైదాన్, మే డే, రెడ్ 2 సినిమాలు చేస్తున్నాడు. రెడ్ 2 చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Drishyam 2 Movie: స్పీడ్ పెంచిన వెంకటేష్.. ‘దృశ్యం-2’ వెంకీ మామా షూటింగ్ కంప్లీట్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ అప్‏డేట్.. ఆ స్పెషల్ రోజున అనౌన్స్ చేయనున్నారా ?