AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ అప్‏డేట్.. ఆ స్పెషల్ రోజున అనౌన్స్ చేయనున్నారా ?

Mahesh Babu New Movie Update: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ అప్‏డేట్.. ఆ స్పెషల్ రోజున అనౌన్స్ చేయనున్నారా ?
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2021 | 8:34 PM

Share

Mahesh Babu New Movie Update: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు… పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబుకు జోడీగా మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంత్రికి విడుదల చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు తన తదపరి సినిమా దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ నెక్ట్స్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‏ డైరెక్షన్లో చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీరి సినిమాకు సంబంధించిన అప్‏డేట్ సూపర్ స్టార్ క్రిష్ణ్ పుట్టిన రోజు అంటే మే 31న ప్రకటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మళ్లీ వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రూపొందబోతున్నట్లుగా టాక్ వినిపించింది. కానీ ఎన్టీఆర్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో కాకుండా.. కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించాల్సి ఉంది చిత్రయూనిట్. అటు రాజమౌళీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.

Also Read: Sharwanandh Sreekaram Movie: ఓటీటీలోకి శర్వానంద్ ‘శ్రీకారం’.. ఎప్పుడు విడుదలంటే..

న్యూ షెడ్యూల్ ఫిక్స్ చేసిన ‘ఎఫ్ 3’ యూనిట్.. కరోనా సమయంలోనూ రిస్క్ చేస్తున్నారా ?

Tamil New Year 2021: సంప్రదాయపు దుస్తుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కీర్తి సురేష్..

ఎన్టీఆర్ కోసం మహేష్ హీరోయిన్.. ప్లాన్ చేస్తోన్న చిరు డైరెక్టర్.. మరోసారి తెలుగులోకి ముంబై బ్యూటీ..