Drishyam 2 Movie: స్పీడ్ పెంచిన వెంకటేష్.. ‘దృశ్యం-2’ వెంకీ మామా షూటింగ్ కంప్లీట్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకటేష్.. ఇటీవల దృశ్యం 2 చిత్రాన్ని

Drishyam 2 Movie: స్పీడ్ పెంచిన వెంకటేష్.. 'దృశ్యం-2' వెంకీ మామా షూటింగ్ కంప్లీట్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..
Drushyam 2 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2021 | 8:59 PM

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకటేష్.. ఇటీవల దృశ్యం 2 చిత్రాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ సాధించిన అసురన్ రీమేక్‏గా నారప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ పై సురేష్ బాబు నిర్మిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మే 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రయూనిట్. ఇందులో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వెంకీ పూర్తిగా తన లుక్ ను మార్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో వెంకటేష్ తోపాటు మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇవే కాకుండా.. మలయళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం 2 సినిమా రీమేక్ లోనూ నటిస్తున్నారు.

దృశ్యం 2 ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న కొన్ని రోజులకే తెలుగులో షూటింగ్ ప్రారంభించారు. దృశ్యం సినిమాలో నటించిన నటీనటులే ఈ ఇందులోనూ నటించనున్నారు. తాజాగా సమాచారం ప్రకారం తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేశారట. ఈ విషయాన్ని డైరెక్టర్ జీతు జోసెఫ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా.. తన సోషల్ మీడియా ఖాతాలో జీతు.. ఈరోజు డీ2 సినిమా షూటింగ్‏లో వెంకటేష్ గారి చివరి వర్కింగ్ డే. మీ సహకారానికి, మద్దతుకి ధన్యవాదాలు సార్’ అంటూ అతను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వెంకీ మామా అభిమానులు షాక్ గురవుతున్నారు. ఇంత తొందరగా ఎలా షూటింగ్ పూర్తిచేసుకున్నాడంటూ.. తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ అప్‏డేట్.. ఆ స్పెషల్ రోజున అనౌన్స్ చేయనున్నారా ?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..