‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్.. ఇదే నిజమైతే యష్ ఫ్యాన్స్‏కు నిరాశ తప్పదు..

'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్.. ఇదే నిజమైతే యష్ ఫ్యాన్స్‏కు నిరాశ తప్పదు..
Kgf 2 Movie

KGF 2 Movie Update: 'కేజీఎఫ్' కన్నడ సినీ పరిశ్రమలో సంచలన హిట్ సాధించిన సినిమా. ఈ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ రేంజ్

Rajitha Chanti

|

Apr 15, 2021 | 10:50 PM

KGF 2 Movie Update: ‘కేజీఎఫ్’ కన్నడ సినీ పరిశ్రమలో సంచలన హిట్ సాధించిన సినిమా. ఈ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సిక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఈ క్రమంలోనే సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఓ వార్తా కన్నడ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఇటీవల ఈ మూవీలో ప్రతినాయకుడికి, హీరోకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ను హైదరాబాద్ లోనే చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో హీరో యష్ చనిపోతాడట. సినిమా క్లైమాక్స్ లో అధిరాను చంపిన తర్వాత మొత్తం కేజీఎఫ్ కి రాజుగా మారిపోతాడు రాకీభాయ్. ఇక అధిరా చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ప్రధాన మంత్రి ప్రత్యేక సైన్యంతో వచ్చి రాకీభాయ్ ను చంపేస్తారట. అంతేకాకుండా.. అతనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే తొలి భాగంలో తన తల్లి చెప్పినట్లుగానే రాకీ.. ధనవంతుడిగానే చనిపోతాడుని.. అలా కే.జీ.ఎఫ్ కథ అంతమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే.. రాకీభాయ్ అభిమానులకు నిరాశ తప్పదు. మరీ నిజాంగానే రాకీభాయ్ చనిపోతాడా లేదా అనేది తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమా జూలై 16న విడుదల కానుంది.

Also Read: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. చికిత్సకు రూ. 16 కోట్లు.. సాయం చేయాలని విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu