చేతులు జోడించి క్షమాపణలు చేబుతున్నా.. ఏ మనిషిని నొప్పించాలనుకోలేదు.. తనికెళ్ల భరణి..

Tanikella Bharani: టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శివుని పై

  • Rajitha Chanti
  • Publish Date - 2:48 pm, Fri, 16 April 21
చేతులు జోడించి క్షమాపణలు చేబుతున్నా.. ఏ మనిషిని నొప్పించాలనుకోలేదు.. తనికెళ్ల భరణి..
Tanikella Bharani

Tanikella Bharani: టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శివుని పై కవితలు రాస్తూ పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం ఆయన గొప్ప శివ భక్తుడు. ఇక ఇప్పటికే ఆయన శివుని పై రాసిన పాటలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన ఫేస్ బుక్ వేదికగా.. శబ్బాష్ రా శంకర అంటూ సీక్వెన్స్ ప్రారంభించారు. ఇందులో శివుడికి సంబంధించిన కొన్ని కవితలను పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ‘గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు.. నువ్వుండంగ లేవంటరు.. ఉన్నవో లేవో చెవుల జెప్పిపోరా శబ్భాష్‌రా శంకరా!!’ అంటూ ఒక పోస్ట్‌ని పెట్టారు. అయితే దీనిపై పలు రకాల విమర్శలు వెలువడ్డాయి. చాలా మంది నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా తనికెళ్ళ భరణిని ట్రోల్ చేశారు. ఇక ఈ వివాదం పై బిగ్ బాస్ ఫేం మానవవాదీ, హేతువాదీ బాబు గోగినేని.. తనికెళ్ళ మాటాలను ఖండించారు. ‘గాడిద కొడుకులు’ అని ఎవరైనా ఒళ్లు బలిస్తేనే వ్రాస్తారు.. అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు గోగినేని.

Tanikella Bharani Face Book

Tanikella Bharani Face Book

ఇక ఈ వివాదం కాస్తా పెరగడంతో తనికెళ్ల భరణి సోషల్ మీడియా వేదికగా క్షమపణలు చెప్పారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదంటూ.. బేషరుతుగా క్షమాపణలు చెప్పారు. గత కొన్ని రోజులుగా శభాష్ రా శంకరా అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతు వస్తున్నా.. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించడం.. బాధ కలిగించడం జరిగిందని తెలిసింది. ఇక దానికి నేను వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఏం చెప్పినా కవరింగ్ లాగే ఉంటుంది కాబట్టి.. నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఆ పోస్టును డిలీట్ చేశా.. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా.. అందరికీ నమస్కారం’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు తెలిపారు తనికెళ్ల భరణి.

వీడియో..

Also Read: అలుసుగా చూస్తారు.. లోకువ చేస్తారు.. అనాది కాలంగా అబలవె నువ్వు.. హత్తుకుంటున్న ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్..

‘ఈశ్వరా.. పరమేశ్వరా’ నాట్యం కోసం బేబమ్మ ఎంత శ్రద్ధ పెట్టిందో చూశారా.. మేకింగ్ వీడియోను షేర్ చేసిన కృతి..