Celebrities: వారూ..వీరూ లెక్కలు కరోనాకు లేవు..కోవిడ్ బారిన పడిన ఈ నటుల లిస్టు చూడండి..మీకే అర్ధం అవుతుంది!

Celebrities: వారూ..వీరూ లెక్కలు కరోనాకు లేవు..కోవిడ్ బారిన పడిన ఈ నటుల లిస్టు చూడండి..మీకే అర్ధం అవుతుంది!
Celebrities

కరోనాకు వారూ వీరు అని ఉండదు. ఈ వైరస్ కు ఎటువంటి బేధాలు లేవు. జాగ్రత్తగా లేకపోతే ఎవరినైనా పట్టేసుకుంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా ముందు సమానమే.

KVD Varma

|

Apr 17, 2021 | 4:33 PM

Celebrities: కరోనాకు వారూ వీరు అని ఉండదు. ఈ వైరస్ కు ఎటువంటి బేధాలు లేవు. జాగ్రత్తగా లేకపోతే ఎవరినైనా పట్టేసుకుంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా ముందు సమానమే. ఒకరకంగా కరోనా వైరస్ శ్మశాన వైరాగ్యం లాంటిదే. ఎవరికి వారు అదుపులో ఉండకపోతే.. కోవిడ్ బారిన పడినట్టే.. చిన్నా..పెద్దా తేడా తెలీదు. పేదా-ధనిక లెక్కలేదు. ప్రముఖులూ..సామాన్యుల బేధం ఉండదు. అందరినీ ఒకేరకంగా చూస్తుంది. కాకపొతే, దాని బారిన పడితే శరీరం తట్టుకునే శక్తి ఉందా లేదా అన్నదాని మీద ఆధారపడి కరోనా బాధితులు కోలుకోవడం..లేకపోవడం జరుగుతుంది అంతే. అక్కడ కూడా ఎంత డబ్బున్నా పనిచేయదు.. ఎన్నికోట్ల మంది ప్రజల అభిమానమున్నా అడ్డుపడదు. కరోనా ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండోసారి మరింత ఉధృతంగా విరుచుకు పడుతోంది. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ వరుసలో కరోనా కోరల్లో చిక్కుకున్న్ సినీ నటుల సంఖ్యా తక్కువేమీ కాదు. కరోనా మొదటి వేవ్ లో గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం దానికి బలైపోయారు. కొంత మంది సినీ నటులూ ప్రాణాలు కోల్పోయారు. సినీ నటులు ఎక్కువగా గుంపుల మధ్య ఉండాల్సి రావడం వారికి కరోనా సోకే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి వేవ్ లో బిగ్ బీ అమితాబ్ కుటుంబం మొత్తం కరోనాతో ఇబ్బంది పడ్డారు. ఇక రెండో వేవ్ లోనూ చాలా మంది నటులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. నిన్నటికి నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనాకు చిక్కారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రముఖ హాస్యనటుడు వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని కూడా చనిపోవడం విషాదాన్ని నింపింది. సహజంగా షూటింగ్ సమయంలో సినీనటుల విషయంలో జాగ్రత్తలు చాలా ఎక్కువే తీసుకుంటారు. అయినప్పటికీ వీరు కోవిడ్ బారిన పడటం అభిమానుల్ని ఆందోళనలో ముంచేస్తోంది.

మొదటి దశలోనూ..ఇప్పుడు రెండో దశలోనూ కోవిడ్ బారిన పడిన సెలబ్రిటీలు పదుల సంఖ్యలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా కరోనా బారిన పడిన సెలబ్రిటీల వివరాలు సంక్షిప్తంగా మీకోసం..

1. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.. రెండోసారి ఆయనకు కరోనా బారిన పడడంతో హోం ఐసోలేషన్ లో చికిత్స 2. సినీ నటి, రాజకీయ నేత నగ్మాకు కరోనా పాజిటివ్ 3. కత్రినా కైఫ్ కూడా కరోనా, హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స 4. యూరీ’ ది సర్జికల్ స్ట్రైక్ హీరో విక్కీ కౌశల్ కు కరోనా.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స 5. కరోనా బారిన పడ్డ బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ 6. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్‌కు కరోనా.. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ముంబై ఎన్ సీబీ కస్టడీలో ఉన్న ఖాన్ 7. బాలీవుడ్ నటుడు గోవిందాకు కరోనా పాజిటివ్.. రామ్ సేతు షూటింగ్ సమయంలో కరోనా బారిన పడ్డ అక్షయ్ కుమార్.. మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌లో జాయిన్ అయిన అక్షయ్ 8. సినీనటి నివేదా థామస్ కూడా కరోనా.. సెకండ్ వేవ్‌లో కోవిడ్ బారిన పడిన నటి ఆసుపత్రిలో చికిత్స 9. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కు కరోనా పాజిటివ్ 10. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా కరోనా.. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక అల్లు అరవింద్ కరోనా 11. బాలీవుడ్ నటి ఆలియా భట్ కరోనా.. షూటింగ్ సమయంలో వైరస్ వచ్చిందని ప్రకటించిన ఆలియా భట్ 12. ప్రముఖ సంగీత దర్శకడు బప్పీలహరికి కరోనా.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స 13. నటుడు పరేష్ రావల్ కూడా కరోనా పాజిటవ్ 14. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌కి పాజిటివ్‌గా నిర్ధార‌ణ 15. నటుడు మాధవన్ కు కోవిడ్ పాజిటివ్.. హోం ఐసోలేషన్ లో చికిత్స 16. కరోనా బారిన పడి కోలుకున్న జెనీలియా 17. నటుడు, నేత పృథ్వీరాజ్‌ కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి బాగోక పోవడంతో ఆసుపత్రిలో చికిత్స 18. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా 19. కరోనా బారిన పడి కోలుకున్న హీరో వరుణ్ తేజ్ 20. హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా 21. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న శరత్ కుమార్ 22. దివంగత నటుడు చిరంజీవి సర్జ భార్య మేఘనాకు కరోనా.. హోం క్వారంటైన్‌లో చికిత్స 23. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‌కు కూడా కరోనా నిర్ణారణ.. డాక్టర్ల సలహాతో హోం ఐసోలేషన్‌లో చికిత్స 24. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి పద్మజలకు కరోనా పాజిటివ్ 25. ‘జుగ్ జుగ్ జియో’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న అనిల్ కపూర్ కు కరోనా 26. హీరోయిన్ నీతు కపూర్ కు కరోనా 27. నటుడు వరుణ్ ధావన్ కు కరోనా పాజిటివ్ 28. బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్ని డియోల్‌కు కరోనా పాజిటివ్.. ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్న సన్నిడియోల్ 29. మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్, మరో టెస్ట్ చేస్తే నెగిటివ్ రిపోర్టు 30. జీవిత రాజశేఖర్ దంపతులకు కరోనా.. క్రిటికల్ గా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స 31. కరోనా బారిన పడ్డ హీరోయిన్లు శివానీ, శివాత్మిక 32. మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా.. 14 రోజుల హోం క్వారంటైన్ తర్వాత కోలుకున్న అందాల భామ.. తమన్నా పేరెంట్స్ కు కరోనా 33. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు‌ కరోనా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత 34. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్.. డాక్టర్ల సలహాతో హోం క్వారంటైన్‌లో చికిత్స 35. ప్రముఖ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్ లో చికిత్స 36. హీరోయిన్ నిక్కీ గర్లానీకి కరోనా పాజిటివ్.. కోవిడ్ నుంచి కోలుకున్న బాలీవుడ్ భామ 37. సినీటి నటాషా సూరి కరోనా 38. ప్రముఖ టీవీ నటి నవ్య స్వామి కరోనా.. కోలుకుని షూటింగ్స్‌లో పాల్గొంటున్న నవ్య 39. సింగర్ స్మిత‌కు కరోనా పాజిటివ్, కోలుకున్న స్మిత 40. హీరోయిన్, మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాకు కరోనా పాజిటివ్.. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స, కోలుకున్న నవనీత్ కౌర్ 41. తమిళ హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డికి కరోనా పాజిటివ్ 42. విశాల్‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా.. హోమియోపతి చికిత్స తీసుకొని కోలుకున్న విశాల్ 43. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. ఆసుపత్రిలో చికిత్స, కోలుకుని షూటింగ్స్‌లో పాల్గొంటున్న అమితాబ్ 44. నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ దంపతులకు కరోనా.. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న బచ్చన్ దంపతులు.. వారి కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ 45. సినీనటి, మాండ్యా ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్ 46. ప్రముఖ కన్నడ నటుడు ధృవ సర్జ, ఆయన భార్యకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే చికిత్స, కోలుకున్న ధృవ కుటుంబం 47. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా పాజిటివ్ 48. నటి మలైకా అరోరా కరోనా 49. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా.. హోం క్వారంటైన్‌లో ఉన్న అర్జున్ కఫూర్ 50. బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్‌కు కరోనా.. హోం క్వారంటైన్‌లో చికిత్స కోలుకున్న కిరణ్ 51. హిందీ సినిమా హీరోయిన్ మోహెనా కుమారి సింగ్‌ కు కరోనా.. ఆమె కుటుంబసభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్, షూటింగ్ లకు బంద్.

వీరేకాక ఇంకా చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్న అంత పెద్ద సెలబ్రిటీలు కూడా కరోనా బరిన పడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా మహమ్మారికి చిక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ లిస్టు అందించాం.

Also read: Sonu Sood: ఏమీ చేయలేకపోతున్నాను..పరిస్థితి దారుణంగా ఉంది..దీనికి ఎవరినీ నిందించవద్దు అంటున్న సోనూసూద్!

ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu