Corona Second Wave: కేలండర్‌తోపాటు మారిన కరోనా.. మ్యూటెంట్ వెర్షన్ మహా డేంజర్.. ఏ రాష్ట్రంలో ఎలా?

డబుల్ మ్యూటెంట్ అయిన కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో డేంజరస్‌గా విజృంభిస్తోంది. తొలి దశ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుందేమో మరింత బలంగా మారి మానవాళికి...

Corona Second Wave: కేలండర్‌తోపాటు మారిన కరోనా.. మ్యూటెంట్ వెర్షన్ మహా డేంజర్.. ఏ రాష్ట్రంలో ఎలా?
Coronavirus In India,second Wave Corona
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 17, 2021 | 4:21 PM

Corona Second Wave is becoming more dangerous: కేలండర్ మారింది… 2020 వెళ్ళిపోయి 2021 వచ్చింది. దాంతో పాటు కరోనా కూడా మారింది. కాకపోతే మరింత బలంగా మారింది. డబుల్ మ్యూటెంట్ అయిన కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో డేంజరస్‌గా విజృంభిస్తోంది. తొలి దశ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుందేమో మరింత బలంగా మారి మానవాళికి సవాల్ విసురుతోంది. దేశంలో సెకెండ్ వేవ్ మొదలై నెల దాటుతుండగా కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఆందోళన పెంచుతోంది. దాంతో దేశం క్రమంగా మరోసారి ఆంక్షల బాట పడుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు అనేక రాష్ట్రాలు కఠిన నిబంధనలకు పూనుకుంటున్నాయి. ఆంక్షల అమలులో మహారాష్ట్ర ముందున్నట్లు కనిపిస్తోంది.

కరోనా వైరస్ రెండో దశలో అతి దారుణంగా విస్తరిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో ప్రతీ రోజు 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. జాతీయ స్థాయిలో నమోదవుతున్న కేసుల్లో సింహభాగం మహారాష్ట్రలోనే రికార్డవుతున్నాయి. దాంతో ఏప్రిల్ 14 రాత్రి 8 గంటల నుంచి 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూని విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రమంతగా 144 సెక్షన్ అమలు చేస్తూ.. జనం ఒకేచోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూస్తోంది. అత్యవసర, నిత్యావసర సేవలు, సర్వీసులు మినహా అన్ని కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించింది ‘మహా’ ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమలవుతుండగా.. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు మూసి వేశారు. సినిమా థియేటర్లు కేవలం 30 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

మహారాష్ట్ర తర్వాత కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న మరో ప్రాంతం ఢిల్లీ. దేశ రాజధానిలో సెకెండ్ వేవ్ తాకిడి బలంగా కనిపిస్తోంది. దాంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఢిల్లీలో ప్రతీ రోజు దాదాపు 20 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దానికి తోడు డబుల్ మ్యూటెంట్ అయిన కరోనా వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దాంతో కఠిన ఆంక్షలను విధించిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ మహానగరంలో వారాంతపు కర్ఫ్యూ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వ్యాపార, వ్యాణిజ్య కార్యకలాపాలను బంద్ చేయించింది. కర్ఫ్యూ అమల్లో వుండగా.. షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, మార్కెట్లు, స్పా సెంటర్లు, జిమ్‌లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ సర్కార్. సినిమా థియేటర్లు కేవలం 30 శాతం సీటింగ్ కెపాసిటీతో నడపాలని, రెస్టారెంట్లు కేవలం ఫుడ్ హోం డెలివరీ ఆర్డర్లతో నడపాలని నిర్దేశించింది. ఆల్‌రెడీ నిర్ణయమైన పెళ్ళిళ్ళు కేవలం 50 మందితోను, అంత్యక్రియలు కేవలం 20 మందితోను నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నానాటికి పరిస్థితి దారుణంగా మారుతోంది. దాంతో వైరస్ విస్తృతిని కట్టడి చేసేందుకు యుపి ప్రభుత్వం ఆదివారాలు లాక్‌డౌన్ ప్రకటించింది. ఆదివారాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో వుంటుందని యుపి ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారాల్లో బహిరంగ ప్రదేశాల్లో పెద్దఎత్తున శానిటైజర్లు చల్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలుంటాయని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా మాస్కు ధరించన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని యుపి సీఎం ఆదేశాలిచ్చారు. దాంతో మాస్కు లేకుండా మొదటి సారి పట్టుబడితే.. వేయి రూపాయలు… రెండో సారి కూడా మాస్కు లేకుండా దొరికితే ఏకంగా పది వేల రూపాయలు జరిమానా విధిస్తామని యుపి పోలీసులు ప్రకటించారు. అదే సమయంలో కరోనా కేసులు ఎక్కువగా వున్న మహారాష్ట్ర, కేరళ, రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు లేకపోతో యుపిలోకి అనుమతించమని తేల్చి చెప్పింది.

మధ్యప్రదేశ్‌లోనూ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రభుత్వం ‘కరోనా కర్ఫ్యూ’ పేరుతో ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర, వైద్య సేవలు, నిర్మాణ కార్యకలాపాలు, నిత్యావసర దుకాణాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ పత్రం తప్పనిసరి అని పేర్కొంది. రాజస్థాన్‌లోనూ ఏప్రిల్‌ 16 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్‌ 19 ఉదయం 5 గంటల వరకు వారాంతాపు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నిత్యావసర, వైద్య సేవలు మినహా అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. వివాహాది శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించింది. అయితే శనివారం ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా నెగెటివ్‌ సర్టిఫికేటు తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రంలోనూ ఏప్రిల్‌ 10 నుంచి లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. పండగలు, మతపరమైన బహిరంగ సమావేశాలపై నిషేధం విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడపాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యాల్లో 100 మంది, సామాజిక, రాజకీయ, విద్య, వినోదం, క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలకు 200 మందికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చింది.

రోజువారీ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్కడ బెంగళూరు సహా ఏడు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. చండీగఢ్‌, కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగటివ్‌ సర్టిఫికేట్ చూపించాలని స్పష్టం చేసింది. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రెండోసారి కరోనా బారినపడిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. స్కూళ్లు మూతబడ్డాయి. చండీగఢ్‌ ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. చండీగఢ్‌కు వచ్చేవారు కొవా పంజాబ్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక దేశంలో అత్యధికంగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో కేరళ కూడా వుంది. దాంతో అక్కడ ఏప్రిల్‌ 30 వరకు కరోనా ఆంక్షలు విధించింది అక్కడి సర్కారు. దుకాణాలన్ని రాత్రి 9 గంటల వరకు మూసివేయాలని స్పష్టం చేసింది. అవుట్‌డోర్‌ కార్యక్రమాల్లో 200, ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించి పాల్గొనరాదని సూచించింది. ఇక, తెలంగాణలో మాస్క్‌ లేకపోతే రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. గుజరాత్‌, ఒడిశా, హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లోని పలు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది.

ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
మీ రిలేషన్‌షిప్ బిందాస్‌గా ఉండాలా? ఈ 4 సిక్రెట్స్ మీ కోసమే..
మీ రిలేషన్‌షిప్ బిందాస్‌గా ఉండాలా? ఈ 4 సిక్రెట్స్ మీ కోసమే..
సిరాజ్‌కు కోపం తెప్పించిన ఆసీస్ ప్లేయర్.. కట్‌చేస్తే..
సిరాజ్‌కు కోపం తెప్పించిన ఆసీస్ ప్లేయర్.. కట్‌చేస్తే..
హార్దిక్ పాండ్యా రూ. 400 ఫీజుకు చిన్ననాటి సెలక్టర్‌కు ధన్యవాదాలు
హార్దిక్ పాండ్యా రూ. 400 ఫీజుకు చిన్ననాటి సెలక్టర్‌కు ధన్యవాదాలు
ముసలి వాళ్లమైపోతే మన చర్మం ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా?
ముసలి వాళ్లమైపోతే మన చర్మం ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా?
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
అడ్వాన్స్ బుకింగ్‌లో పుష్ప 2 రికార్డ్..ఇప్పటిదాకా ఎన్ని కోట్లంటే?
అడ్వాన్స్ బుకింగ్‌లో పుష్ప 2 రికార్డ్..ఇప్పటిదాకా ఎన్ని కోట్లంటే?
భారత జట్టులో అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్?
భారత జట్టులో అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్?
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఆల్కహాల్‌ సేవిస్తున్నారా?
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఆల్కహాల్‌ సేవిస్తున్నారా?
టీమిండియాకు గుడ్‌న్యూస్.. సిద్ధమైన స్టార్ ప్లేయర్
టీమిండియాకు గుడ్‌న్యూస్.. సిద్ధమైన స్టార్ ప్లేయర్
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..