ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…

Ashu Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. ఇక పవన్ కోసం

  • Rajitha Chanti
  • Publish Date - 4:03 pm, Sat, 17 April 21
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్... ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి...
Ashureddy

Ashu Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. ఇక పవన్ కోసం ఏమైనా చేసే వారు ఎందరో ఉన్నారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా.. కొంత మంది సెలబ్రెటీలు కూడా పడిచచ్చిపోతుంటారు. ఇందులో బిగ్ బాస్ ఫేం అషురెడ్డి కూడా ఒకరు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా.. జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది అషూ. అమ్మడుకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. శుక్రవారం పవన్ కళ్యాణ్‏కు కరోనా పాజిటివ్ అని రావడంతో అషూ ఎమోషనల్ అయ్యింది. తన ఇన్‏స్టాగ్రామ్ లైవ్ వీడియోలో ఏకంగా కన్నీళ్లు పెట్టెసుకుంది.

పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం మనందరికి తెలుసు. కానీ.. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన ఆరోగ్యం కోసం నేను దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేమి చేయలేను. దేవుడున్నాడు.. పవన్ త్వరలోనే తిరిగి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకొస్తారు. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా మాస్క్ వేసుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అని తెలుపుతూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఈ వీడియో నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పేరును ప్రైవేట్ పార్ట్ పై పచ్చబొట్టు పొడుపించుకుని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండా.. ఆయనకు నాలుగో భార్యాగా ఉండటానికి కూడా సిద్ధమే అంటూ సంచలన కామెంట్స్ చేసింది అషు రెడ్డి.

వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Aslo Read: Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..

Saina Movie: అమెజాన్‌ ప్రైమ్‌లోకి ‘సైనా’.. అఫీషియల్ ట్వీట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

‘జాతిరత్నాలు’ టీంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా క్రికెటర్.. అలా చేయడం కష్టం.. కానీ మీరు సుసాద్యం చేశారంటూ..