అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో స్క్రీన్ పై కనిపించారు.

  • Rajitha Chanti
  • Publish Date - 9:42 pm, Sat, 17 April 21
అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..
Pawan Kalyan Prakash Raj

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో స్క్రీన్ పై కనిపించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. హిందీ చిత్రం పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజ్ నిర్మించారు . ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తోపాటు… కీలక పాత్రల్లో నటించిన ప్రకాశ్ రాజ్, అనన్య నాగల్ల, అంజలి, నివేదా థామస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో ప్రకాశ్ రాజ్ పవన్ కు ప్రత్యర్థిగా లాయర్ పాత్రలో నటించాడకు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘బద్రి’ సినిమాలో వీరిద్దరి నటనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మరోసారి అదేస్థాయిలో వీరిమద్య ఇంటెన్సిటీ వకీల్‌సాబ్ సినిమాలో వీరిద్దరిలో కనిపించింది. వాద ప్రతివాదాలు చేసుకొనే సమయంలో ఇద్దరు పోటాపోటీగా నటించారు. తాజాగా ప్రకాష్ రాజ్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సుస్వాగతం’ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్‌కి తాను ఇప్పుడు చూసిన పవన్ కళ్యాణ్‌కి అసలు సంబంధమే లేదు. అప్పట్లో పవన్ చాలా మోహమాటంగా ఉండేవారు. చాలా సిగ్గరి. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ ఆయనలో చాలా మార్పు వచ్చింది. నటన పరంగా, క్రేజ్ పరంగా, వ్యక్తిత్వం పరంగా ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆయన ఎంత బోల్డ్‌గా ఉంటారో.. అంతే సింపుల్ వ్యక్తి. ప్రజల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. ఆయన నటనతో పాటు.. వ్యక్తిత్వం కారణంగానే ఆయన్ని ఈ రోజు ఇంత మంది ప్రేమిస్తున్నారు’’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

Also Read: Vijay Antony: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘విజయ రాఘవన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…