Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. న్యూ ప్రాజెక్ట్‏ను ప్రారంభించిన విశ్వక్ సేన్..

ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సూప‌ర్‌హిట్స్ అందుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్‌.

Vishwak Sen: 'అశోకవనంలో అర్జున కళ్యాణం'.. న్యూ ప్రాజెక్ట్‏ను ప్రారంభించిన విశ్వక్ సేన్..
Vishwak Sen
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2021 | 8:52 PM

ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సూప‌ర్‌హిట్స్ అందుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్‌. ఈయన ప్రధాన పాత్రలో ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు. బి, సుధీర్ నిర్మిస్తోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమా శుక్ర‌వారం పూజా కార్యక్రమాలు జరుపుకొని లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. దుర్గ‌(విష్వ‌క్ సేన్ అమ్మ‌గారు) ఈ సినిమా ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్‌కొట్టారు. ఇక ఈ సినిమాతో విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా …. నిర్మాత‌లు బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే టైటిల్ ఎంత డిఫ‌రెంట్‌గా ఉందో, సినిమా కూడా అలాగే ఉంటుంది. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వక్‌సేన్‌ న‌టించిన, న‌టిస్తోన్న చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన చిత్రం. ఇందులో విశ్వక్‌ లుక్ కూడా కొత్త‌గా ఉంటుంది. ఈ చిత్రానికి ర‌వికిర‌ణ్ రచయితగా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతోనే విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

ప్రస్తుతం విశ్వక్ పాగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని మే1న థియేటర్లలోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు చిత్రయూనిట్. మ్యాజికల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Also Read:  ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‏బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…

Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..

Balakrishna: ‘అఖండ’ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. శ్రీకాంత్‏తో తలపడేందుకేనా..