Sehari Movie: ఆకట్టుకుంటున్న సెహరి టీజర్… బాలయ్యను వాడేస్తున్న చిత్రయూనిట్…

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న`సెహ‌రి` మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు (ఏప్రిల్ 16) విడుద‌ల‌చేసింది.

Sehari Movie: ఆకట్టుకుంటున్న సెహరి టీజర్... బాలయ్యను వాడేస్తున్న చిత్రయూనిట్...
Entertainment
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 17, 2021 | 9:16 PM

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న`సెహ‌రి` మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు (ఏప్రిల్ 16) విడుద‌ల‌చేసింది. ఈ బృందం ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు హర్ష్‌ను వర్జిన్ స్టార్ అని పిలిచే ప్రకటన వీడియో `సెహ‌రి` టీజ‌ర్ మంచి రెస్పాన్స్ సంపాదించడానికి ఎంత‌గానో ఉపయోగ‌ప‌డింది. వ్యూహాత్మకంగానే వారు బాలకృష్ట‌గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. బాలకృష్ణగారు గ‌తంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని పేర్కొన్న విష‌యం తెలిసిందే.. అందుకే ఈ చిత్ర బృందం కూడా అదే ట్యాగ్ లైన్ ద్వారా అతన్ని పిలవాలని నిర్ణయించుకుంది. “మేము బాలకృష్ణ గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చాము. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు మేము కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాము” అని మేకర్స్ ప్ర‌క‌టించారు.

తన ప్రియురాలితో క‌లిసి ఆనందకరమైన జీవితాన్నిగడిపే వరుణ్ పాత్రలో హర్ష్ కనుమిల్లి క‌నిపించారు. ఒక్క‌సారిగా త‌న‌తో బ్రేక‌ప్ అవ‌డం, దాంతో మ‌రోక‌రితో వివాహానికి సిద్ద‌మ‌వ‌డం మ‌నం ఈ టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత త‌ను వివాహం చేసుకోబోయే అమ్మాయి అక్క సిమ్రాన్ చౌదరితో సన్నిహితంగా ఉండ‌డం ద్వారా త‌న భాగ‌స్వామి ఎంపిక సరైనది కాదని అతను గ్రహించడం టీజ‌ర్లో చూపించారు. హ‌ర్ష్ క‌నుమిల్లి కామెడి టైమింగ్ ఈ టీజ‌ర్‌కి మేజ‌ర్ హైలెట్ అని చెప్పొచ్చు. ద‌ర్శ‌కుడు జ్ఞాన సాగ‌ర్ ద్వారక `సెహ‌రి` చిత్రాన్ని యూత్ ఫుల్ రామ్‌- కామ్‌ ఎలిమెంట్స్‌తో ఆహ్లాద‌కరంగా ‌ తెర‌కెక్కించారు. ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం ఆకర్షణీయంగా ఉంది. శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అద్వ‌య జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..

Vijay Antony: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘విజయ రాఘవన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

Celebrities: వారూ..వీరూ లెక్కలు కరోనాకు లేవు..కోవిడ్ బారిన పడిన ఈ నటుల లిస్టు చూడండి..మీకే అర్ధం అవుతుంది!