మరో పాన్ ఇండియా డైరెక్టర్‏తో ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్… ఆ స్పెషల్ రోజునే అనౌన్స్ చేయనున్న మేకర్స్ ?

మరో పాన్ ఇండియా డైరెక్టర్‏తో ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్... ఆ స్పెషల్ రోజునే అనౌన్స్ చేయనున్న మేకర్స్ ?
Jr.ntr

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. రాజమౌళీ తెరకెక్కిస్తున్న రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాతో బిజీగా ఉన్నారు.

Rajitha Chanti

|

Apr 19, 2021 | 8:21 AM

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. రాజమౌళీ తెరకెక్కిస్తున్న రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి జోడీలుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామా ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా…. కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. వీరితోపాలు పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయో చిత్రం.. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం యంగ్ టైగర్.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారట. ఇప్పటికే వీరిద్ధరి మధ్య చర్చలు కూడా జరిగిపోయాయట. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా… ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. అటు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కొరటాల శివ కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్జే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Jagapathi Babu: కరోనాకు థ్యాంక్స్ చెబుతున్న జగపతి బాబు.. కారణమెంటో తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Sukumar: సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట.. అసలు విషయం ఏంటంటే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu