AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai In OTT: మ‌ళ్లీ ఓటీటీ బాట ప‌డుతోన్న సినిమాలు.. క‌రోనా ప్ర‌భావ‌మేనా.. గంగూబాయి కూడా..

Gangubai In OTT: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావితమైన రంగాల్లో సినిమా రంగం కూడా ఒక‌టి. రూ. కోట్ల బిజినెస్ జ‌రిగే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కంటికి క‌నిపించ‌ని వైర‌స్ కార‌ణంగా చ‌తికిల ప‌డింది. గతేడాది...

Gangubai In OTT: మ‌ళ్లీ ఓటీటీ బాట ప‌డుతోన్న సినిమాలు.. క‌రోనా ప్ర‌భావ‌మేనా.. గంగూబాయి కూడా..
Gangu Bai Ott
Narender Vaitla
|

Updated on: Apr 19, 2021 | 8:05 AM

Share

Gangubai In OTT: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావితమైన రంగాల్లో సినిమా రంగం కూడా ఒక‌టి. రూ. కోట్ల బిజినెస్ జ‌రిగే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కంటికి క‌నిపించ‌ని వైర‌స్ కార‌ణంగా చ‌తికిల ప‌డింది. గతేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో థియేట‌ర్లు మూత‌ప‌డ‌డం, షూటింగ్ ఆగిపోవ‌డంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా స‌డ‌లింపుల‌ను స‌డ‌లించ‌డంతో మ‌ళ్లీ థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. సినిమా షూటింగ్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇదిలాఉంటే ఇప్పుడు మ‌ళ్లీ గ‌తేడాది ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా మ‌ళ్లీ షూటింగ్‌లు ఆగిపోతున్నాయి. న‌టీన‌టులు క‌రోనా బారిన ప‌డుతుండ‌డంతో కొన్నిసినిమాలు షూటింగ్ వాయిదా వేసుకున్నాయి. ఇక కొన్నిరాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తుండ‌డంతో సినిమాల విడుద‌ల‌లు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్నాయి. గ‌తేడాది చిత్ర నిర్మాత‌లు సినిమాల విడుద‌ల కోసం ఓటీటీ బాట ప‌ట్టినట్లే.. ఈసారి కూడా అదే దారిలో వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తెలుగులో వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన దృశ్యం2 ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో ముంబ‌యిలో థియేట‌ర్లు మూసివేయంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: అది లోక కల్యాణం.. భక్తకోటికి చూసి తరించాల్సిన అద్భుతమైన ఘట్టం.. ఆ మహోత్సవాన్ని చూసే భాగ్యం కొందరికే!

Jagapathi Babu: కరోనాకు థ్యాంక్స్ చెబుతున్న జగపతి బాబు.. కారణమెంటో తెలుసా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Horoscope Today: ఈ రాశుల వారికి నూతన ఉద్యోగాలు.. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.. ఈరోజు రాశిఫలాలు

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌