Karthika Deepam: కార్తీక్ నిజంగా మారాడా.. లేక జాలిపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సౌందర్య.. మోనిత శనిలా పట్టుకుందన్న భాగ్యం
Karthika Deepam:కార్తీక్ బోజనానికి కిందకు వస్తాడు.. తనను టెర్రస్ మీదకు వెళ్ళమని సౌందర్య చెబుతుంది. దీంతో కార్తీక్ నేను ఇక్కడే తింటా అని అంటే.. అందరూ ఏమైంది అని ప్రశ్నిస్తారు. కార్తీక్ టెర్రస్ మీదకు భోజనానికి వెళ్లకపోతే దీప తో పాటు...
Karthika Deepam: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1017 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన కార్తీక దీపం సీరియల్ మంచి రసపట్టు సాగుతుంది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో చూద్దాం..
కార్తీక్ బోజనానికి కిందకు వస్తాడు.. తనను టెర్రస్ మీదకు వెళ్ళమని సౌందర్య చెబుతుంది. దీంతో కార్తీక్ నేను ఇక్కడే తింటా అని అంటే.. అందరూ ఏమైంది అని ప్రశ్నిస్తారు. కార్తీక్ టెర్రస్ మీదకు భోజనానికి వెళ్లకపోతే దీప తో పాటు. తాను కూడా మందులు వేసుకోనని ఆనందరావు బెదిరిస్తాడు..అయితే కార్తీక్ ప్రవర్తన చూసి.. నిజంగా మారాడా.. లేక జాలి చూపిస్తున్నాడా అంటూ అనుమానిస్తారు..మరోవైపు పిల్లలు, దీప మేడ మీద భోజనం చేయడానికి కార్తీక్ కోసం ఎదురు చూస్తారు.. వస్తాడా రాదా అంటూ ఆలోచిస్తుంటే.. దీప పిల్లలకు అన్నం తినిపిస్తుంది. ఇంతలో కార్తీక్ మేడ మీదకు వచ్చి.. దీపకు ఇంజెక్షన్ చేస్తాడు. ఇంతలో శౌర్య, దీప బలభద్రాపురంలోని సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడతారు.
సౌందర్య, ఆనందరావు , మురళీకృష్ణ, భాగ్యం, శ్రావ్య, ఆదిత్య కలిసి కూర్చుకుని మాట్లాడుకుంటుంటే.. ఇంతలో వారణాసి వస్తాడు.. దీపని సొంత తోడబుట్టిన వాడులా చూశాడు.. కష్ట నష్టాల్లో దీపకి అండగా ఉన్నాడు అంటారు. దీపని కలవడానికి కాదని.. డాక్టర్ బాబు కారు ఇవ్వడానికి వచ్చానని అంటాడు. డాక్టర్ బాబు కారు పంచర్ అయితే స్టేఫినీ మార్చి తీసుకొచ్చాను అంటాడు ఈ విషయం తనకు మోనిత చెప్పింది. డాక్టర్ బాబుని మోనితే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లింది అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దీంతో మోనిత అన్నయ్యని వదిలేలా లేదు అంటూ ఆదిత్య అసహనం వ్యక్తం చేస్తే.. భాగ్యం .. దీప ని మురళీ కృష్ణ తీసుకొచ్చాడా లేదా అని ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. తిట్టి పంపించాను అని అంటాడు.. అయితే సౌందర్య ధీమా వ్యక్తం చేస్తుంది.. తన కొడుకు, కోడలు కలిసిపోయారని.. వందమంది మోనితలు కూడా ఏమి చెయ్యలేరని అంటుంది.
మేడ మీద దీపకి ఇంజెక్షన్ చేసిన కార్తీక్ కి దీపకి పిల్లలు భోజనం పెడతారు. ఆ సన్నివేశం చూసిన సౌందర్య, ఆనందరావు లు చాలా సంతోషపడతారు. దూరం నుంచే వాళ్లని ఆశీర్వదిస్తారు. శౌర్య తన వాగుడితో కార్తీని విసిగిస్తుంటుంది.. దీంతో కార్తీక్ ఇక చాలు రౌడీ.. కూరవెయ్యి అంటాడు.. దీంతో దీప నవ్వుతుంది.. ఇంతలోనే ఏడుపు ఇంతలోనే నవ్వు అంటుంటే.. డాక్టర్ బాబు ప్లేట్‌లో కూర ఉంది..’ అని నవ్వుతుంది.. ఇదే సీన్ చూసి దూరం నుంచే ఆనందరావు, సౌందర్యలు కూడా నవ్వుకుంటారు. . దాంతో అక్కడే ఉన్న హిమ, సౌర్యతో పాటు దూరంగా ఉన్న ఆనందరావు, సౌందర్యలు నవ్వుకుంటారు. కార్తీక్ అన్నం కలుపుకుని ముద్ద పెట్టుకోబోతుంటే.. దీప ఆ ముద్ద లాక్కుని తినేస్తుంది. అది చూసి పిల్లలు నవ్వుతారు.. రేపటి ఎపిసోడ్ లో దీపకి ఫోన్ చేసిన మోనిత … దీప హెల్త్ ఇలా పాడడానికి ఎవరో ఇచ్చిన డ్రగ్ రీజన్ అంటూ మోనిత కి చెప్పిన కార్తీక్.. నెక్స్ట్ ఏంటి..?
Also Read: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!