AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Amount: UAN నంబర్ లేకుండానే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..

EPFO వినియోగదారులు ఇప్పుడు UAN నంబర్ లేకుండానే వారి పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను చెక్ చేసుకోనే విధంగా

EPF Amount:  UAN నంబర్ లేకుండానే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..
Epfo
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2021 | 9:41 AM

Share

EPFO వినియోగదారులు ఇప్పుడు UAN నంబర్ లేకుండానే వారి పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను చెక్ చేసుకోనే విధంగా EPFO సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఇపిఎఫ్ఓ సభ్యులకు ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) పెట్టుబడులు మరింత పారదర్శకంగా చేయడానికి పలు మార్పు చేసింది. EPFO ​​వినియోగదారులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఈపీఎఫ్ఓ హోమ్ పేజీకి లాగిన్ కావాల్సి ఉంటుంది.

UAN నంబర్ లేకుండా PF బ్యాలెన్స్ చెక్ ఎలా చేయాలి..

ఇందుకోసం పీఎఫ్ లేదా ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా ఈపీఎఫ్ఓ హోం పేజీలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్లిక్ హియర్ టూ నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్ (click here to know your PF balance.) అనే ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో చూపించే గడులలో వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది.

1. ముందుగా EPFO ​​హోమ్ పేజీలో లాగిన్ అవ్వండి – epfindia.gov.in. 2. క్లిక్ హియర్ టూ నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్ (click here to know your PF balance.) పై క్లిక్ చేయండి. 3. epfoservices.in.epfo పేజీ ఓపెన్ అవుతుంది. 4. ఆ తర్వాత మీ రాష్ట్రం, ఈపీఎఫ్ సెంటర్, ఎస్టాబ్లిష్‍మెంట్ కోడ్( establishment code), పీఎఫ్ అకౌంట్ నంబర్, మిగతా వివరాలను ఫిల్ చేయాలి. 5. ఆ తర్వాత ఐ అగ్రీ అనే బటన్ పై క్లిక్ చేయాలి. 6.మీ కంప్యూటర్ లేదా మొబైలో పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది.

UAN నంబర్‌తో PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం..

EPFO వినియోగదారులకు UAN నంబర్ ఉంటే.. SMS లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా Pf బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ‘EPFOHO UAN అని ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒకరి PF లేదా EPF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Also Read: ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..

Oxygen Tankers to Telangana: తెలంగాణకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిన జిందాల్ కంపెనీ.. రెమ్‌డెసివిర్‌డోసుల ఉత్పత్తికి సాయం