Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..

Ayushman bharath yojana:దేశంలోని పేదల కోసం కేంద్రం తీసుకువచ్చిన ప్రత్యేకమైన స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్న వారికి

Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..
Ayushman Card
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 21, 2021 | 7:51 AM

Ayushman bharath yojana: ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ లబ్ధిదారులకు శుభవార్త. ఇక నుంచి మీరు ఉచితంగానే ఆయుష్మాన్ భారత్ కార్డును పొందొచ్చు.  ఇంతకు ముందు ఈ కార్డు కోసం రూ.30 చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదే. ఉచితంగానే ఆయుష్మాన్ కార్డు అందుకోండి.  దేశంలోని పేదల కోసం కేంద్రం తీసుకువచ్చిన ప్రత్యేకమైన స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్న వారికి రూ.5 లక్షల వరకు ఇన్సూ రెన్స్ కవరేజ్ కింద ఆర్థిక సాయం అందుతుంది. ఆయుష్మాన్ లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డు వస్తుంది. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కార్డు ప్రింట్ తీసుకోవాలి. దీనికి రూ.30 చెల్లించాలి. అయితే ఇప్పుడు.. ఈ కార్డు కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. ఉచితంగానే ఈ కార్డును పేదలకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్డు ఉన్నవారు హాస్పిటల్స్‏కు వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. ఆసుపత్రిలో అయ్యే ట్రీట్ మెంట్ కోసం ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దీంతో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు లభిస్తాయి.

ఈ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే ప్రభుత్వ ఆరోగ్య సెంటర్ లేదా ఆయుష్మాన్ భారత్ వెబ్ సైట్ కు వెళ్ళి ఈ స్కీంలో చేరొచ్చు. ఈ పథకంలో చేరాలంటే మీకు అర్హత ఉందో లేదో కూడా వెబ్ సైట్ ద్వారానే సులభంగా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా.. ఆయుష్మాన్ భారత్ కార్డు పీవీసీ కార్డు రూపంలో ఏటీఎం కార్డును పోలి ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు ఈ కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మీకు ఒక వేళ ఈ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి.

Also Read: అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. దయచేసి ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయండి.. ఓమైగాడ్ నిత్య..

ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమైన.. అనుష్క శర్మ.. తోడుగా వామిక కూడా ఉందిగా.. ఫోటోస్ వైరల్ ..

Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..