అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. దయచేసి ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయండి.. ఓమైగాడ్ నిత్య..
Fun Bucket Bhargav: మైనర్ బాలిక ఆత్యాచార కేసులో ఫన్ బకెట్ భార్గవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ళ బాలికను
Fun Bucket Bhargav: మైనర్ బాలిక ఆత్యాచార కేసులో ఫన్ బకెట్ భార్గవ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ళ బాలికను మాయమాటలతో నమ్మించి గర్భవతిని చేయడంతో.. ఇతనిపై దిశ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే ఫన్ బకెట్ భార్గవ్ మైనర్ బాలికను రేప్ చేశాడని న్యూస్ రావడంతో.. చాలా మంది ఓమైగాడ్ ఫెం నిత్య ఫోటోలను తెరపైకి తీసుకువచ్చారు. నిత్య భార్గవ్‌తో కలిసి.యయ ఓమైగాడ్ ఓమైగాడ్ అంటూ వీడియోలను చేసింది. వీరిద్దరి కలిసి చేసిన ఓమైగాడ్ వీడియోలకు విశేష స్పందన వచ్చింది. అయితే రేప్ కేసులో భార్గవ్ అరెస్ట్ కావడంతో.. చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో నిత్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ కేసు విషయంపై స్పంధించింది నిత్య. అయితే అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదని.. ఫన్ బకెట్ భార్గవ్‌తో మాట్లాడి ఏడాదిపైనే అయ్యిందని.. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని వీడియో విడుదల చేసింది నిత్య.
నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడటం జరిగింది. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది?? అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ గొడవలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్ వాళ్లు నా పేరు వాడుతున్నారు. నా ఫొటోలు వాడుతున్నారు. వీళ్లందరూ తెలియక చేస్తున్నారని తెలిసి.. క్లారిటీ ఇస్తున్నా. మీరు నా ఫొటోలు వాడటంలాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు ఏంటో తెలుస్తుంది అంటూ తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది. (OMG Nithya)
Also Read: Corona Vaccine: వినుత్న కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకుంటే టమోటాలు ఫ్రీ..