AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప.  టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Pushpa Movie: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Allu Arjuna Pushpa Raj
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Apr 21, 2021 | 7:52 AM

Share

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప.  టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తిఅయింది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది.  పుష్ప లో బన్నీ ఉరమాస్ లుక్ కు ట్రెమండ్రస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది.

ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కాని పుష్ప సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాను వాయిదా వేయనున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  పలు సినిమాలు షూటింగ్ ను వాయిదా వేసుకుంటున్నాయి. కానీ సుకుమార్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కనీసం రెండు నెలలు తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక సినిమా విడుదల సమయం ఆగస్టు వరకు ఖచ్చితంగా అంతా సర్థుకుంటుందని వారు నమ్మకంతో ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

21 Years for Badri: పవన్ కళ్యాణ్ బద్రికి 21 సంవత్సరాలు.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న డైలాగ్స్..

కరోనా బారిన పడ్డ జబర్దస్త్ బ్యూటీ.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ ఎమోషనల్….

Bollywood Music Director: చిత్ర పరిశ్రమలో ఆగని కరోనా కల్లోలం..బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమం..