Bollywood Music Director: చిత్ర పరిశ్రమలో ఆగని కరోనా కల్లోలం..బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమం..
Bollywood Music Director: కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్పవారిని కబళించింది. మన దేశంలో కూడా ప్రాముఖులు ఎందరో కరోనా బారిన పడి మరణించారు. కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో..
Bollywood Music Director: కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్పవారిని కబళించింది. మన దేశంలో కూడా ప్రాముఖులు ఎందరో కరోనా బారిన పడి మరణించారు. కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో కల్లోలం సృష్టించగా… రోజు రోజుకీ మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటికే అనేక మంది మరణించారు. చాలా మంది కోవిడ్ కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే కరోనా బారిన పడిన బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రవణ్ కుమార్ రాథోడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత శ్రవణ్ ముంబైలోని రహేజా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే శ్రవణ్ మృత్యువుతో పోరాటం చేస్తున్నట్లు సమాచారం.
కరోనాతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఆరోగ్యం మరింత క్షీణించి ఆందోళనకరంగా మారిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రవణ్ కుమార్ రాథోడ్ మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి ఆస్పత్రి నుంచి రావాలని సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
బాలీవుడ్ లో నదీమ్ శ్రవణ్ జంట అంటే అప్పట్లో ఓ రేంజ్ లో క్రేజ్ .. వీరిద్దరూకలిసి అనేక సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించారు. నదీమ్- శ్రవణ్ జంట బాణీలు కట్టిన అనేక సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. 1990 నుంచి 2000 మధ్యకాలంలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది ఈ జంట. ఆషీకీ, సాజన్, దిల్ హైకీ మాంతా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే, సడక్, దీవానా, ఫూల్ ఔర్ కాంటే, పర్‌దేశ్ వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ కు సంగీతం అందించారు ఆ .జంట.
Also Read: పర్యావరణ రక్షణ కోసం ఓ సంస్థ నయా సృష్టి.. మొలకెత్తే మాస్కుల తయారీ.. ఎక్కడంటే