AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paper Seed Mask: పర్యావరణ రక్షణ కోసం ఓ సంస్థ నయా సృష్టి.. మొలకెత్తే మాస్కుల తయారీ.. ఎక్కడంటే

Paper Seed Mask: జపాన్, చైనా కొరియా వంటి దేశాల్లో కరోనాకి ముందు కూడా మాస్కులు వాడేవారు. అయితే మన దేశంలో మాత్రం కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే మాస్కులు వాడడం గురించి తెలుసు..

Paper Seed Mask: పర్యావరణ రక్షణ కోసం ఓ సంస్థ నయా సృష్టి.. మొలకెత్తే మాస్కుల తయారీ.. ఎక్కడంటే
Paper Seed Mask
Surya Kala
|

Updated on: Apr 20, 2021 | 10:11 AM

Share

Paper Seed Mask: జపాన్, చైనా కొరియా వంటి దేశాల్లో కరోనాకి ముందు కూడా మాస్కులు వాడేవారు. అయితే మన దేశంలో మాత్రం కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే మాస్కులు వాడడం గురించి తెలుసు. దాదాపు ఏడాదిన్నరకు పైగా మాస్కులు కూడా మనిషి జీవితంలో ఒక భాగమయ్యాయి. కరోనా వైరస్ నివారణ కోసం గత ఏడాది నుండి ప్రజలు..మాస్కుల వినియోగానికి అలవాటు పడ్డారు.

రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా తో మాస్కుల వాడకం కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఒక్కసారి వినియోగించి వదిలేయడం వల్ల వ్యర్థాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో కర్ణాటక లోని మంగళూరుకు చెందిన ఓ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. పర్యావరణ హితంగా ఉండేలా మాస్కులు రూపొందించింది.

సరికొత్తగా సీడ్‌ మాస్కులను తయారు చేసింది. వీటిని ఒక దళసరి పాటి పేపర్‌ మధ్యలో టమాటా, తులసి, దోసకాయ, క్యాప్సికం వంటి విత్తనాలను పెట్టి మాస్కులు రూపొందించింది. మాస్కులు వాడేసిన తర్వాత పడేస్తే…అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ మాస్కులను మంగళూరులోని పేపర్‌ సీడ్‌ అనే సంస్థ తయారు చేస్తోంది. ఇవి ఒక్కసారి వాడి పడేయాల్సిన మాస్కులని, పేపర్‌తో రూపొందించినవి కాబట్టి…ఒకసారే వినియోగించాలని చెప్పింది. ప్రస్తుతానికి ఇలాంటివి 400 మాస్కులు తయారు చేశామని, ప్రయోగం విజయవంతమైతే.. ఇలాంటివి మరిన్ని తయారుచేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

ఈ సంస్థ గతంలోనూ పలు ప్రయోగాలు చేసింది. పర్యావరణ హిత రాఖీలు, ఆభరణాలు, కీచైన్లు, కొబ్బరి మట్టలతో కప్పులు, స్థానికంగా లభ్యమయ్యే తీగలు, ఊడలతో శిల్పాలు, బక్కెట్లతో పాటు సీడ్‌ పెన్నులు, పెన్సిళ్లు, పేపర్‌ స్ట్రాలు, ఆర్గానిక్‌ అగర్‌బత్తీలు, టూత్‌బ్రష్‌లు తయారు చేసింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న మాస్కులు వాడి పడేసిన తర్వాత.. భూమి, నీళ్లలో కలిసినా పర్యావరణానికి హాని కలిగిస్తాయని. కానీ, ఇలాంటి పర్యావరణ హిత మాస్కులు మొక్కల పెరుగుదలకు, తద్వారా పర్యావరణ రక్షణకు ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇవి బాగా మందంగా ఉంటుండడంతో.. వైరస్‌ను కూడా కట్టడి చేస్తోందని చెబుతున్నారు. ఈ మాస్కులకు అప్పుడే డిమాండ్‌ పెరిగిందని.. ఇప్పటికే చెన్నై, బెంగళూరు సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు తయారీదారులు

Also Read: : కరోనా విజృంభణ.. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు

తెలంగాణ మరోసారి కోరలుచాస్తున్న మహమ్మారి.. కొత్తగా 5926 మందికి పాజిటివ్, 18 మంది మృతి