తామరతంపరగా కోవిడ్ కేసుల వెల్లువ, ఇండియాను బ్రిటన్ రెడ్ లిస్టులో చేర్చింది.. అంటే ?

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో బ్రిటన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. భారత్ ను రెడ్ లిస్టులో చేర్చింది. అంటే ఈ కేసుల మహమ్మారితో సతమతమవుతున్న సుమారు 40 దేశాల...

  • Umakanth Rao
  • Publish Date - 10:21 am, Tue, 20 April 21
తామరతంపరగా  కోవిడ్ కేసుల వెల్లువ, ఇండియాను బ్రిటన్ రెడ్ లిస్టులో చేర్చింది.. అంటే ?
India Added To Uk Covid Red List

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో బ్రిటన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. భారత్ ను రెడ్ లిస్టులో చేర్చింది. అంటే ఈ కేసుల మహమ్మారితో సతమతమవుతున్న సుమారు 40 దేశాల సరసన ఇండియా కూడా చేరింది. దేశంలో కోవిడ్ కేసుల పెరిగిపోతున్న దశలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఇండియా పర్యటనను రద్దు చేసుకున్న కొన్ని గంటలకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక భారత్ నుంచి ఏ ప్రయాణికుడిని బ్రిటన్ తమ దేశంలోకి అనుమతించబోదు. నిజానికి గత పది రోజుల క్రితమే యూకే సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియాను కూడా ఈ లిస్టులో చేర్చింది. విదేశాలనుంచి వచ్చే తమ దేశస్థులు గానీ ఐరిష్ వాసులు గానీ లండన్ విజిట్ చేయవచ్చునని కానీ వారు ప్రభుత్వం ఆమోదించిన హోటల్ లో  10 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని బ్రిటన్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ నెల9 వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ముందు తమ దేశంలో ప్రవేశించినవారు 10 రోజులపాటు స్వీయ నియంత్రణలో (సెల్ఫ్ ఐసోలేషన్) లో ఉండాలని,  ఆ తరువాత కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

బంగ్లాదేశ్, కెన్యా,  పాకిస్తాన్, ఫిలిపీన్స్ వంటివి   కూడా బ్రిటన్ రెడ్ లిస్ట్ లో చేర్చిన దేశాల్లో ఉన్నాయి.  యూకే లో ప్రవేశించగోరే ప్రయాణికులందరూ విధిగా కరోనా నెగెటివ్ రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి[పోతున్న నేపథ్యంలో.. కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా రాష్ట్రాలు ఇకపై నేరుగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుంచి టీకామందులను కొనుగోలు చేసుకోవడానికి అనుమతించింది. ఒకవిధంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేఛ్చనిచ్చింది.అటుబ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై ఇండియా  దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నిజానికి ఆ దేశంతో భారత్ కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇండియానుంచి పెద్ద ఎత్తున వివిధ దేశాలకు వ్యాక్సిన్ పంపిన ప్రభుత్వ ఉదారతను యూకే ప్రశంసించింది కూడా.
మరిన్ని చదవండి ఇక్కడ: PM Modi Meet: దేశంలో టీకా డ్రైవ్‌ సరళీకృతం.. ఇవాళ వ్యాక్సిన్స్ ఉత్పత్తిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ\

Oxygen Tankers to Telangana: తెలంగాణకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిన జిందాల్ కంపెనీ.. రెమ్‌డెసివిర్‌డోసుల ఉత్పత్తికి సాయం