అంగారక గ్రహంపై ఎగిరిన నాసా వారి మినీ హెలికాఫ్టర్ సృష్టికర్త మనవాడే ! అతడే….

అరుణగ్రహంపై ఎగిరిన నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థవారి మినీ రోబో హెలికాఫ్టర్ సృష్టికర్త మనవాడే ! బాబ్ బలరామ్ అనే ఈ యువ చీఫ్ ఇంజనీర్ భారత సంతతి వాడే.. ఈ హెలికాప్టర్ రూప కల్పన కోసం....

  • Umakanth Rao
  • Publish Date - 12:02 pm, Tue, 20 April 21
అంగారక గ్రహంపై ఎగిరిన నాసా వారి మినీ హెలికాఫ్టర్ సృష్టికర్త మనవాడే ! అతడే....
Iit Madras Alumnus Bob Balaram The Man Behind Nasa's Mars Helicopter

అరుణగ్రహంపై ఎగిరిన నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థవారి మినీ రోబో హెలికాఫ్టర్ సృష్టికర్త మనవాడే ! బాబ్ బలరామ్ అనే ఈ యువ చీఫ్ ఇంజనీర్ భారత సంతతి వాడే.. ఈ హెలికాప్టర్ రూప కల్పన కోసం ఈయన విశేషంగా  కృషి చేశాడు. నాసాలో దాదాపు 20 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్ధి అయిన బలరామ్ 1975-80 బ్యాచ్ కి చెందినవాడు. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ఈయన బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తరువాత అమెరికాలోని అతి ప్రాచీన ‘రెన్ సీలర్ పాలిటెక్నీక్ టెక్నాలజికల్ రీసర్చ్ యూనివర్సిటీలో ఎం.ఎస్ కంప్యూటర్స్ చేశాడు. ఇదే సంస్థ నుంచి పీ హెచ్ డీ పట్టా కూడా అందుకున్నాడు.

అపోలో మూన్ లాండింగ్ మిషన్ ఇతనికి అంతరిక్షం, సైన్స్ పై ఆసక్తిని పెంచింది. అప్పటి నుంచి ముఖ్యంగా మార్స్ పై దిగే మినీ రోబో హెలికాఫ్టర్ రూపకల్పన కోసం కృషి చేస్తూ వచ్చానని బలరామ్ తెలిపారు. నాసాలోని మార్క్ హెలికాఫ్టర్ స్కౌట్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్న ఈయన మరిన్ని సరికొత్త ప్రాజెక్టుల కృషిలో నిమగ్నమై ఉన్నాడట. బలరామ్ వంటి భారత సంతతి ఇంజనీర్లు తమ సంస్థకే గర్వకారణమని నాసా హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన వైట్ హౌస్ లో అనేకమంది భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించిన సంగతి విదితమే.  భారతీయుల మేధా శక్తిని ఆయన పలు సందర్భాల్లో ప్రశంసించారు. చివరకు తన ప్రసంగాలకు ఓ రూపు నిచ్చే యువ భారతీయ  రీసెర్చర్ ని కూడా ఆయన వైట్ హౌస్ లో నియమించుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు.. మే 1 వరకు అమలు
Corona Virus: మహారాష్ట్రలో ఆగని కరోనా ఉధృతి.. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సీఎం థాకరే..