Corona Virus: మహారాష్ట్రలో ఆగని కరోనా ఉధృతి.. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సీఎం థాకరే..
Corona Virus: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కల్లోల సృష్టిస్తుంటే.. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్.. రోజు రోజుకీ విజృంభిస్తుంది. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తుంది...
Corona Virus: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కల్లోల సృష్టిస్తుంటే.. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్.. రోజు రోజుకీ విజృంభిస్తుంది. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తుంది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. కరోనా కల్లోల అరికట్టాలంటే.. లాక్ డౌన్ తప్పని సరి అని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు తెలియజేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అజిత్ పవార్ రాష్ట్రంలో కరోనా కట్టడికోసం నియమ నిబంధనలను మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది అత్యవసర సేవల్లో పాల్గొంటున్నారు. ఈ సంఖ్యను తగ్గించాలని అజిత్ పవార్ సూచించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, కరోనా వ్యాప్తికి అడ్డుకట్టపడడం లేదు. దీంతో అత్యవసర సేవల జాబితాలో ఉన్న కిరాణా దుకాణాలను తెరవడానికి ఇచ్చిన సమయాన్ని తగ్గించే యోచనలో ఉంది. మంగళవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాబట్టి, ఈ సమావేశం రాష్ట్రంలోని వ్యాపారుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకూ కిరాణా దుకాణాలు ఉదయం 7 నుండి 11 వరకు తెరిచి ఉంటాయి. ఈ సమయాన్ని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంటె.. దానిని వ్యాపారులు వ్యతిరేకించే అవకాశం ఉంది.
దేశంలో కరోనా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్న తరుణంలో, కేంద్ర స్థాయిలో కదలికలు మొదలయ్యాయి. చర్యల చేపట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీదారులతో చర్చలు జరపనున్నారు. కేంద్ర మంత్రివర్గం యొక్క ముఖ్యమైన సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఏమైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారా అనే విషయం పై అందరి దృష్టి ఉంది.
Also Read: చిత్ర పరిశ్రమలో ఆగని కరోనా కల్లోలం..బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమం..