Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు అమలు

కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయాల్లోకర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు..  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు అమలు
Telangana Night Curfew
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 20, 2021 | 12:32 PM

Telangana Night Curfew: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. అయినా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాత్రి సమయాల్లోకర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ కరోనా కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు పేర్కొంది.

క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ వ‌ర‌కు రాష్ర్టంలో రాత్రి క‌ర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మిన‌హాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. కోవిడ్  నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటలో పేర్కొంది.

ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా.. రాత్రి 8 గంటల వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, మాల్స్, షాపులకు అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత ఎక్కడైనా దుకాణాలు తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులతో పాటు అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది.

Read Also: ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..

 Corona Virus: మహారాష్ట్రలో ఆగని కరోనా ఉధృతి.. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సీఎం థాకరే..

మీకు 18 ఏళ్లు నిండాయా? మీరు కరోనా టీకా తీసుకోవాలంటే ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..