AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination above 18: మీకు 18 ఏళ్లు నిండాయా? మీరు కరోనా టీకా తీసుకోవాలంటే ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..

కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అందరికీ కరోనా టీకా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది.

Vaccination above 18: మీకు 18 ఏళ్లు నిండాయా? మీరు కరోనా టీకా తీసుకోవాలంటే ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..
Covid 19 Vaccination
KVD Varma
| Edited By: |

Updated on: Apr 19, 2021 | 10:15 PM

Share

Vaccination above 18: కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అందరికీ కరోనా టీకా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో మాత్రం కొంత ధర తీసుకుంటారు. అన్ని చోట్లా మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. మరి ఈ టీకా తీసుకోవడం ఎలా? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ కోవిన్ లోకి వెళ్ళాలి. (cowin.gov.in)

2. మీ పది సంఖ్యల మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి

3. మీ ఫోన్ నెంబరుకు ఒక ఒటీపీ వస్తుంది. దీనిని అక్కడ కోరిన చోట ఎంటర్ చేయాలి

4. మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తరువాత ఒక విండో వస్తుంది. దానిలో మీరు ఎప్పుడు టీకా తీసుకోవాలనుకున్తున్నారో తేదీ..సమయం ఎంటర్ చేయాలి.

5. మీరు ఎంటర్ చేసిన తేదీలో వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

6. తరువాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ ద్వారా మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు.

కోవిడ్ వ్యాక్సిన్ ఫేస్ 3 లో టీకా వేయించుకోవడానికి కావలసిన పత్రాలు..

ఈ కింద చెప్పిన వాటిలో ఏదైనా ఒక ఐడీ కార్డు మీరు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఉండాలి.

ఆదార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, కార్మికశాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఎంపీ, ఎంఎల్ఏ లేదా ఎంఎల్సి ఇచ్చిన గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్, బ్యాంకు/పోస్టాఫీస్ పాస్ బుక్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటి కార్డు,. భారత ప్రభుత్వంతో వ్యాక్సినేషన్ కంపెనీలు చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 శాతం వ్యాక్సిన్ లు ఉచితంగానూ.. 50 శాతం వ్యాక్సిన్ లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఓపెన్ మార్కెట్ లోనూ అందచేస్తాయి.

Also Read: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది

కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

తన కేర్ టేకర్ ను వాటేసుకున్న గున్న ఏనుగు.. ఫోటో వైరల్!