AP Corona : ఏపీలో మాస్క్‌ ధరించకపోతే జరిమానా, కోవిడ్‌ నియంత్రణ, నివారణపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

CM YS Jagan review : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణపై సీఎం వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు...

AP Corona :  ఏపీలో మాస్క్‌ ధరించకపోతే జరిమానా, కోవిడ్‌ నియంత్రణ, నివారణపై సమీక్షలో సీఎం  కీలక నిర్ణయాలు
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 19, 2021 | 9:47 PM

CM YS Jagan review : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణపై సీఎం వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎవరైనా మాస్క్‌ ధరించకపోతే జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో రూ.100 జరిమానా విధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 1నుంచి 9 తరగతులకు సెలవులు ప్రకటించామని.. హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు సైతం మూసివేయాలన్నారు. ఫంక్షన్‌ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం.. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జగన్‌ స్పష్టం చేశారు. అయితే, యథావిథిగా 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. జూనియర్‌ కాలేజీల హాస్టళ్లు కూడా వార్షిక పరీక్షల వరకే కంటిన్యూ అవుతాయని చెప్పారు. 104 కాల్‌ సెంటర్‌ను ఇంకా పాపులర్‌ చేయాలని జగన్ అధికారుల్ని ఆదేశించారు. కోవిడ్‌ సమస్యలన్నింటికీ ఆ నెంబరు పరిష్కార గమ్యంగా ఉండాలని సీఎం సూచించారు. సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కన్వెన్షన్‌ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని సీఎం ఆదేశించారు.

ఇక, ఆస్పత్రుల పిపేర్డ్‌నెస్‌ మీదా సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు. ఆస్పత్రులలో మంచి వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటు ఉండాలని, శానిటేషన్‌ పక్కాగా ఉండేలా చూడాలన్నారు. కోవిడ్‌ నిర్థారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లు పరిశీలించాలని.. కరోనా టెస్టు కోరుకున్న వారికే చేయాలని జగన్ అన్నారు. గ్రామాలు, వార్డులలో ఇప్పటికే వలంటీర్ల ద్వారా సర్వే మొదలైందన్న సీఎం.. ఎవరైనా జ్వరంతో బాధ పడుతున్నా, లేదా అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయిస్తున్నామన్నారు. అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్‌ సరఫరా ఉండాలని.. విశాఖలోని ప్లాంట్‌ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని, అవసరమైతే ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టండని సీఎం స్పష్టమైనా ఆదేశాలిచ్చారు.

Read also :  Covid Vaccine : కరోనా సెకండ్‌వేవ్‌ను అడ్డుకోడానికి కేంద్రం వడివడి అడుగులు.. దేశంలోని ప్రముఖ డాక్టర్లతో మోదీ కీలక సమావేశం