Corona second wave: సెకండ్ వేవ్ కు కారణం అదేనా…పరిశోధకులు ఏమంటున్నారు?

Corona second wave: సెకండ్ వేవ్ కు కారణం అదేనా...పరిశోధకులు ఏమంటున్నారు?
Coronavirus In India

క‌రోనా వైర‌స్ ప్రపంచదేశాలను దడ పుట్టిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో దాదాపు మూడు లక్షల దగ్గరకు కేసులు వెళ్ళాయంటేనే ఎంతగా వైరస్ ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు.

KVD Varma

|

Apr 19, 2021 | 10:10 PM

Corona second wave: క‌రోనా వైర‌స్ ప్రపంచదేశాలను దడ పుట్టిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో దాదాపు మూడు లక్షల దగ్గరకు కేసులు వెళ్ళాయంటేనే ఎంతగా వైరస్ ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంతగా వ్యాపించడానికి కారణం ఏంటనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు కారణం డ‌బుల్ వేరియంట్ బి.1.617 అంటున్నారు. అసలు అది ఏంటో తెలుసుకుందాం…

కరోనా రెండో వేవ్ లో మన దేశంలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం మూడు లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే, పపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా ఇండియా నిలుస్తుంది. అమెరికాలో ఇప్పటివరకూ 3 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఎప్పుడు ఈ కేసుల పరంపర పెరిగిపోవడానికి బి.1.617 వేరియంటే కార‌ణ‌మా అన్న కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. హైద‌రాబాద్‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బ‌యాల‌జీ(సీసీఎంబీ) సంస్థ ఆ వేరియంట్‌ పై అధ్యయనం సాగిస్తోంది. ఇంకా ఈ అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ కొత్త రకం వైరస్ జన్యు క్రమాన్ని సీసీఎంబీ స్టడీ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల నుంచి తెచ్చిన శ్యాంపిళ్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు పరిశోధకులు. ఈ శాంపిళ్ళ ఫలితాలు మరో రెండురోజులలో వస్తాయని భావిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ కి కారణం కొత్త వేరియంటా..కాదా అనేది తేల్చనున్న అధ్యయనం. అయితే, ఇప్పటికే ఇది కొత్త వేరియంట్ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. అదీకాకుండా ఈ వేరియంట్ మరో రూపు తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర వేరియంట్ల కన్నా బి.1.617 మ‌రింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. అయితే, దీనిలో రెండు మ్యుటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. ఈ484Q, ఎల్452ఆర్ ముటెంట్లను సీసీఎంబీ కనిపెట్టింది.

వైరస్ లు సహజ సిద్ధంగా పరివర్తనం చెందుతాయి. ఈ క్రమంలో కొన్ని బలహీన పడతాయి. కొన్ని బలం పుంజుకుంటాయి. బలపడిన మ్యుటేంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని డాక్టర్ రాకేశ్ చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన 50 శాతం శాంపిల్స్ ను పరిశీలించిన పరిశోధకులు వాటి జన్యువులో బి.1.617 వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. పంజాబ్ శాంపిల్స్ లో మాత్రం యూకే వేరియంట్ బి.1.17 ను గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ల పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప‌ని చేస్తాయా లేదా విష‌యం పై అధ్యయనం జరుగుతోంది. క‌రోనా వైర‌స్ ప్రాణాంత‌కంగా మారిందా లేదా అన్న అంశాన్ని సీసీఎంబీ పరిశోదిస్తోంది. దేశంలో 80 శాతం కరోనా కేసులు పెరగడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణం అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మాస్క్ లు పెట్టుకోక పోవడం.. ఆరుబయట తిరగడం.. శానిటైజేషన్ లేకపోవడం, తీసుకునే పదార్థాల, గాలి, నీరు, ఇతరుల ద్వారా వ్యాపించడం ముఖ్య కారణాలుగా చెబుతున్నారు వారు.

Also Read: Turmeric Milk: పసుపు పాలతో రోగనిరోధక శక్తి… అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే తాగకుండా ఉండలేరు..!

AP Corona : ఏపీలో మాస్క్‌ ధరించకపోతే జరిమానా, కోవిడ్‌ నియంత్రణ, నివారణపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu